ETV Bharat / city

తెలంగాణ సీఎం సహాయనిధికి గంగవరం పోర్టు ఛైర్మన్​ భారీ విరాళం - తెలంగాణకు గంగవరం పోర్టు ఛైర్మన్​ విరాళం

కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్​ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు చేయూత ఇచ్చేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. కరోనా వైరస్ నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు గంగవరం పోర్టు ఛైర్మన్​​ డీవీఎస్​ రాజు రూ.కోటి విరాళం అందించారు.

తెలంగాణ సీఎం సహాయనిధికి గంగవరం పోర్టు ఛైర్మన్​ భారీ విరాళం

author img

By

Published : Apr 11, 2020, 7:15 AM IST

లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు.. ప్రముఖులు ముందుకొస్తున్నారు. గంగవరం పోర్టు ఛైర్మన్ డీవీఎస్​ రాజు, ఆయన కుమారుడు పోర్టు ఎండీ రాజగోపాల్ రాజు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ద్వారా సీఎం కేసీఆర్​కు అందించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశమంతా ఏకంకావాల్సిన పరిస్థితి వచ్చిందని డీవీఎస్​ రాజు పేర్కొన్నారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో అందరూ ముందుకొచ్చి తమకు తోచిన సహాయం చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు.

ఇదీ చూడండి: సీఎం సహాయ నిధికి నవయుగ సంస్థ విరాళం రూ. కోటి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.