ETV Bharat / city

Gandhi Hill: గాంధీ నడయాడిన ప్రదేశం.. నిర్లక్ష్యానికి నిలువుటద్దం..!

స్వాతంత్య్రోద్యమంలో భాగంగా గాంధీజీ సందర్శించిన ప్రదేశమది. తెలుగువారిలో భారత స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన స్థలమది. అంతటి చరిత్ర కలిగిన ప్రాంతం.. నేడు పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిరాదరణకు గురైంది. పర్యటకంగా ఎంతో ప్రసిద్ధి చెందాల్సిన విజయవాడలోని గాంధీ హిల్.. ప్రభుత్వ చిన్నచూపుతో అభివృద్ధిలో వెనుకబడింది. గాంధీహిల్​ను పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి వెల్లంపల్లి పనులు ప్రారంభించినా.. ఆశించిన పురోగతి లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు.

గాంధీ నడయాడిన ప్రదేశం
గాంధీ నడయాడిన ప్రదేశం
author img

By

Published : Oct 30, 2021, 7:13 PM IST

స్వాతంత్య్ర కాంక్షను దేశమంతటా రగిలిచేందుకు బాపూజీ అనేక పర్యటనలు చేశారు. ఈ క్రమంలోనే 1920లో విజయవాడకి వచ్చిన గాంధీజీ నగరంలోని రైల్వే స్టేషన్​కు పశ్చిమ భాగంలో ఉన్న ఒక కొండ కింద సమావేశాన్ని నిర్వహించారు. ఆ ప్రాంతమే నేడు గాంధీ హిల్​గా పేరుగాంచింది. పాలకుల నిర్లక్ష్యంతో కొన్నేళ్లుగా నిర్వహణకు దూరంగా ఉన్న ఈ ప్రాంతం..పిచ్చి మెుక్కలు పెరిగి పర్యటకంగా వెనుకబడిపోయింది.

ఈ క్రమంలోనే గాంధీ కొండను పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు నగరపాలక సంస్థ పూనుకుంది. రూ. 2 కోట్ల నిధులు సైతం కేటాయించింది. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని 10 శాతం పనులను హడావుడిగా పూర్తి చేసింది. గాంధీ జయంతి రోజు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఘనంగా గాంధీ హిల్​ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసి తీరుతామని నేతలు స్పష్టం చేశారు. కానీ వారి మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అనుకున్న విధంగా పనుల్లో పురోగతి కనిపించటం లేదు.

గుత్తేదార్ల అనాసక్తి..
గాంధీహిల్​ను అభివృద్ధి చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు రూ. 2 కోట్లతో టెండర్లను ఆహ్వానించారు. కాగా..టెండర్ల వేసేందుకు గుత్తేదారులెవరూ ముందుకు రావటం లేదు. టెండర్లు దక్కించుకోవాలని గుత్తేదారులకు ఉన్నా.. అంత పెద్ద మెుత్తంతో పనులు చేశాక నిధులు వస్తాయో లేదో అన్న అనుమానంతో వారు వెనకడుగు వేస్తున్నారు. దీంతో నగరపాలక సంస్థ అధికారులు వెనక్కి తగ్గారు. రూ.2 కోట్లతో కాకుండా పనులను విభజించి తక్కువ కోట్​కు టెండర్లు పిలవాలని ఆలోచిస్తున్నారు. మెుదట రూ. 20 లక్షలకు టెండర్లు పిలిచేందుకు ఇంజనీరింగ్ అధికారులు సమాయత్తమవుతున్నారు.

స్థానికుల అసంతృప్తి..
ప్రజాప్రతినిధుల మెప్పుకోసం హడావుడిగా నాలుగు రాళ్లును తొలగించి, నాలుగు లైట్లు బిగించి అధికారులు చేతులు దులుపుకున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. స్థానిక మంత్రి, నగర మేయర్ మెప్పుకోసం తూతూమంత్రంగా పనులు సాగించిన అధికారులు.. ఆ తర్వాత కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపిస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పలు క్రీడా వస్తువులు ఏర్పాటు చేసినా నిర్వహణకు సిబ్బందిని నియమించలేదన్నారు. దీంతో గాంధీ హిల్ పర్యటక అభివృద్ధి ఆటకెక్కుతోందని పలువురు విమర్శిస్తున్నారు.

ఇదీ చదవండి

KOTAMREDDY SRINIVASULU REDDY: రోడ్డుపై పడుకొని తెదేపా నేత నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.