తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కోసం.. అదనపు బలగాలను మోహరించాలని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. పెద్ద ఎత్తున చేరుకుంటున్న స్థానికేతరులపై.. నియంత్రణ లేదని కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రకు లేఖ రాశారు.
తిరుపతి పార్లమెంట్ సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా లోపించటంతో వైకాపా నేతలు అనధికారికంగా బయట వ్యక్తుల్ని పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఈసీ నియమించిన స్టాటిక్ సర్వైలెన్స్, ఫ్లయింగ్ బృందాలు సమర్థంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. బయట నుంచి వచ్చిన వ్యక్తులు నకిలీ ఓటరు కార్డులతో దొంగ ఓట్లు వేసే అవకాశం ఉంది. కొందరు పోలీసు అధికారులు వైకాపా నేతలతో కుమ్మక్కై పుంగనూరు నుంచి ఏపీ 09యూ 8416, ఏపీ03టీజె 0482, ఏపీ 03టీ 1152 నెంబర్ రిజిస్ట్రేషన్ ఉన్న బస్సుల్లో బయట వ్యక్తుల్ని తరలిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. -గల్లా జయదేవ్
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని.. లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: