తమ ప్రభుత్వ హయాంలో 90 శాతానికి పైగా కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయని గద్దె రామ్మోహనరావు పేర్కొన్నారు. 14 నెలల వైకాపా పాలన కాలంలో చివరి దశ పనులను పూర్తి చేయించి.. అంతా తమ ఘనతగా ఆ పార్టీ మంత్రులు, నేతలు ప్రకటనలు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రైతులకు నగదు బదిలీ పేరుతో ఉచిత విద్యుత్‌ను.. నిర్వీర్యం చేయాలని వైకాపా ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో.. ప్రజలపై పన్నుల భారం పెరుగుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంపదను పెంచే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదని గద్దె రామ్మోహనరావు విమర్శించారు.
ఇదీ చదవండి: తెలుగు పరిణామ క్రమానికి మరో సాక్ష్యం.. అరుదైన శిలా శాసనం లభ్యం