Funds for AP in Union Budget: పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్‌లో.. ఆంధ్ర, తెలంగాణలోని పలు విద్యా, ఇతర సంస్థలకు నిధులు కేటాయించింది.
కేంద్ర బడ్జెట్‌లో ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ. 56.66 కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న గిరిజన విశ్వవిద్యాలయాలకు 44 కోట్లు.. విశాఖపట్నం పెట్రోలియం విశ్వవిద్యాలయానికి రూ.150కోట్లు కేటాయించింది.
తెలంగాణకు..
హైదరాబాద్ ఆటమిక్ మినరల్స్ డైరక్టరేట్‌కు రూ. 374.25 కోట్లు కేటాయించిన కేంద్రం.. హైదరాబాద్ ఐఐటీకి ఈఏపీ కింద రూ. 300 కోట్లు, హైదరాబాద్ నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డుకు రూ. 19 కోట్లు, వివిధ స్వాతంత్య్ర సమరయోధుల పింఛను రూ.688.14 కోట్లు కేటాయించింది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీరాజ్‌కు రూ. 135.46 కోట్లు, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్(సమీర్)కు రూ. 150 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.
ఇదీ చదవండి:
MP Vijaya Sai On Budget: కేంద్ర ఆర్థికశాఖ ఫార్ములాతో ఏపీకి అన్యాయం: ఎంపీ విజయసాయి