ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు అన్నారు. ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. విజయవాడ నగరంలో ప్రజలు మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉందన్నారు.
ప్రభుత్వాలు ఇప్పటికైనా వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. విభజన అనంతరం రాష్ట్రానికి వచ్చిన ఎయిమ్స్ ఉత్తమ సేవలు అందిస్తోందని చెప్పారు. ప్రజలు ఎయిమ్స్ వైద్య సేవలను వినియోగించుకోవాలని సుబ్బరాజు సూచించారు. మరోవైపు.. లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై పన్ను రద్దు చేయాలని ఫ్రెండ్స్ సర్కిల్.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: