ETV Bharat / city

సల్మాన్ 'ఖాన్ అకాడమీ'లో.. ఉచితంగా చదువు చెప్తారు!

టీచర్లు ఆన్‌లైన్​లో పాఠాలు చెబుతున్నా పిల్లలకు ఎన్నో సందేహాలు. ఇంట్లో పెద్దవాళ్లు వాటిని తీర్చలేకపోవచ్చు లేదా చెప్పే సమయం ఉండకపోవచ్చు. అలాగని ట్యూషన్‌కీ పంపించలేని పరిస్థితి. పోనీ ఆన్‌లైన్‌ ట్యూషన్‌ ఏర్పాటు చేద్దామంటే ఫీజులూ  తక్కువేం కాదు. ఇలాంటి ఇబ్బందులకు చక్కని పరిష్కారం ఖాన్‌ అకాడమీ. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆప్‌, యూట్యూబ్‌ ద్వారా ఉచితంగా చదువు చెబుతూ... పిల్లల్ని చదువుల్లో మెరికల్లా మారుస్తున్న ఈ సంస్థ ఒకప్పుడు సరదాగా ప్రారంభమైనదే.

సల్మాన్ 'ఖాన్ అకాడమీ'లో.. ఉచితంగా చదువు చెప్తారు!
సల్మాన్ 'ఖాన్ అకాడమీ'లో.. ఉచితంగా చదువు చెప్తారు!
author img

By

Published : Nov 9, 2020, 8:23 PM IST

పిల్లలకు లెక్కలంటే భయం. సైన్స్‌ ఓ పట్టాన అర్థంకాదు. ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు. ఆ సబ్జెక్టుల్లోని చిక్కుముళ్లను సులువుగా విప్పేస్తూ ఏ పాఠమైనా ఇట్టే అర్థమయ్యేలా ఉంటాయి ఖాన్‌ అకాడమీ రూపొందించే వీడియో పాఠాలు. కేవలం వీడియో పాఠాలు మాత్రమే కాదు అవి పిల్లలకు ఎంతవరకూ అర్థమయ్యాయో తెలుసుకునేందుకు ప్రత్యేక ప్రాక్టీస్‌ ఎక్సర్‌సైజులు కూడా ఇందులో ఉంటాయి. ఆ మార్కుల్ని బట్టి బాడ్జెస్‌, ఎనర్జీపాయింట్లు విద్యార్ధుల ప్రొఫైల్‌లో వచ్చి చేరతాయి. దాదాపు యాభైలక్షలకు పైగా చందాదారులూ, కోటికిపైగా వ్యూయర్స్‌ ఉన్న ఈ ఖాన్‌ అకాడమీని ఉచితంగా విద్యార్థులకు అందిస్తున్నాడు దీన్ని ప్రారంభించిన సల్మాన్‌ ఖాన్‌. అతనికి ఈ ఆలోచన అనుకోకుండానే వచ్చిందని చెబుతాడు.

లెక్కలు చెప్పాడు...

సల్మాన్‌ఖాన్‌ది బెంగాలీ నేపథ్యం అయినా.. తండ్రి స్వస్థలం బంగ్లాదేశ్‌, తల్లిది భారత్‌. అతడు పుట్టి పెరిగినదంతా అమెరికాలో. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్‌, హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎంబీఏ పూర్తిచేసిన ఖాన్‌.. ఓ సంస్థలో ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌గా చేసేవాడు. ఓసారి తన కజిన్‌కి లెక్కల్లో సందేహాలు తీర్చాల్సి వచ్చింది. ఇంటర్నెట్‌ సాయంతో ఆమెకు లెక్కలు చెప్పడం... అవి సులువుగా అర్థంకావడంతో మిగిలిన బంధువులూ స్నేహితులూ తమ పిల్లలకు కూడా లెక్కలు చెప్పమని అడిగారు.

వాళ్లందరికీ చదువు చెబుతూనే క్రమంగా యూట్యూబ్‌ చానల్‌ని ప్రారంభించాడు. సరిగ్గా మూడేళ్లకు ఆ వీడియోలకు ఆదరణ లభించడంతో ఉద్యోగం మానేసి ఖాన్‌ అకాడమీ పేరుతో ఛానల్‌ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాడు. కేవలం పెద్ద తరగతి విద్యార్థులకు మాత్రమే కాకుండా 1-12 తరగతుల పిల్లలందరికీ ఉపయోగపడేలా పాఠాల్ని వీడియోల రూపంలో ఉంచుతున్నాడు. పిల్లలకు అత్యుత్తమమైన విద్యను అందించేందుకు ప్రారంభించిన ఈ ఖాన్‌ అకాడమీ హిందీ, ఇంగ్లిష్‌ మాత్రమే కాదు చైనీస్‌, ఫ్రెంచ్‌, జెర్మన్‌, స్పానిష్‌, టర్కిష్‌.. వంటి 28కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది.

ఏమేం చదువుకోవచ్చంటే...

ఖాన్‌ ఆకాడమీ అందించే పాఠాలను యూట్యూబ్‌ లేదా ఆప్‌ సాయంతో చూడొచ్చు. మ్యాథ్స్‌, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, హిస్టరీ, ఎకనమిక్స్‌, ఫైనాన్స్‌, గ్రామర్‌.. వంటి సబ్జెక్టులను వీడియో పాఠాల రూపంలో అందిస్తుంది ఖాన్‌ అకాడమీ. పాఠాలను ఎంత సులువుగా అర్థంచేసుకుని నేర్చుకోవచ్చో వివరించడమే కాదు విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేకంగా పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఆ ఫలితాలను బట్టి పిల్లలు తాము ఎంతవరకూ చదువుకోగలిగారో తెలుసుకోవచ్చు. ఇందులో కేవలం పిల్లలకే కాదు టీచర్లకు కూడా స్టడీమెటీరియల్‌ ఉంటుంది. ఈ ఆప్‌ ద్వారా టీచర్లు వర్చువల్‌ క్లాస్‌రూమ్‌ని కూడా ఏర్పాటు చేసుకుని, కొన్ని తరగతులను నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా ఔత్సాహిక విద్యార్థులకోసం శాట్‌, వైద్య విద్య శిక్షణకు సంబంధించిన పరీక్షలకు అవసరమైన సబ్జెక్టులను కూడా అందిస్తుంది. మూడేళ్ల క్రితం కాలేజీ విద్యార్థులూ, ఉద్యోగుల కోసం ఫైనాన్షియల్‌ లిటరసీ ప్రోగ్రాం పేరుతో ప్రత్యేక వీడియో సిరీస్‌ని కూడా ప్రారంభించిందీ సంస్థ.

ప్రస్తుతం ఖాన్‌ అకాడమీలో 200 మంది కంటెంట్‌ నిపుణులు ఉన్నారు. తన ఛానల్‌ ద్వారా అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సాధించిన ఖాన్‌ 2012లో ‘టైమ్స్‌ 100 ఇన్‌ఫ్లుయెన్షల్‌ పీపుల్‌ జాబితా’లో ఒకరిగా నిలిచాడు. అలాగే బెస్ట్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌తో పాటు మరెన్నో అవార్డులూ అందుకుందీ సంస్థ. కేవలం ట్యూషన్లు మాత్రమే కాదు... క్యాలిఫోర్నియాలోనే ల్యాబ్‌ స్కూల్‌నికూడా అందుబాటులోకి తెచ్చాడు ఖాన్‌. అదే విధంగా ఖాన్‌ అకాడమీ కిడ్స్‌ అనే విభాగంలో రెండు నుంచి ఆరేళ్ల పిల్లలకు చదువులో బేసిక్‌ స్కిల్స్‌ నేర్పించేందుకు ప్రత్యేక తరగతులు కూడా ఉన్నాయి. విద్యార్థులకు పూర్తి ఉచితంగా చదువు - అదీ ఆన్‌లైన్‌ ద్వారా అందించాలంటే డబ్బూ అవసరమే. దానికి అవసరమైన నిధులు ఖాన్‌ పెద్దగా కష్టపడకుండానే సమకూరాయి. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, బిల్‌- మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌, టాటా ట్రస్ట్‌ వంటివి ఈ సంస్థకు మొదట్నుంచీ ఫండ్స్‌ని అందిస్తున్నాయి. అదేవిధంగా కొత్త కోర్సులను ఆవిష్కరించినందుకు గూగుల్‌ సంస్థ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు అందించడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.