SomiReddy On Amaravathi Corporation : ప్రజల్ని హింసిస్తే కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిద్రపట్టడంలేదని తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకే రాజధాని కోసం భూమిలిచ్చిన రైతుల్నిపీడిస్తున్నారని మండిపడ్డారు.
రాజధానిని 29గ్రామాల పరిధి నుంచి 19గ్రామాలకు పరిమితం చేసేందుకే అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ పేరులోనే క్యాపిటల్ సిటీ అని పేర్కొని భూములు తాకట్టు పెట్టుకునే కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు.
ఇదీ చదవండి : AMARAVATI CORPORATION : అమరావతి రాజధాని నగరపాలక సంస్థ... రెండో రోజూ గ్రామసభలు