అనుకూలంగా ఉండే అధికారులను అడ్డుపెట్టుకుని వైకాపా స్థానిక ఎన్నికల్లో.. మోసాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. విజయవాడ గొల్లపూడిలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రణాళిక ప్రకారం.. ఆలస్యంగా మొదలుపెట్టారని విమర్శించారు. కొంతమంది పోలీసులు, రెవెన్యూ అధికారులు వైకాపాకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ విధానం కొనసాగాలి. కౌంటింగ్లో జరుగుతున్న అవకతవకలపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాం. అవసరం అయితే హైకోర్టును ఆశ్రయిస్తాం.
- మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
ఇదీ చదవండీ.. హోరాహోరీగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం...