ETV Bharat / city

పోలీసుల అదుపులో మాజీ మావోయిస్టులు..? - Maoists in police custody news

మాజీ మావోయిస్టులు వారణాసి సుబ్రహ్మణ్యం, అతని సహచరి లక్ష్మీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. పౌరహక్కుల సంఘం నేత చంద్రశేఖర్ పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ద్వారా అదుపులోకి తీసుకున్నవారిని.. వెెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పోలీసుల అందుపులో మాజీ మావోయిస్టులు..?
పోలీసుల అందుపులో మాజీ మావోయిస్టులు..?
author img

By

Published : Mar 22, 2021, 7:07 AM IST

మాజీ మావోయిస్టులు వారణాసి సుబ్రహ్మణ్యం, అతని సహచరి లక్ష్మీలను పోలీసులే అదుపులోకి తీసుకున్నారని.. పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ ఆరోపించారు. చండీఘఢ్​లో మోకాలి అపరేషన్ చేయించుకుని వస్తున్న వారిని సుబ్రహ్మణ్యం బావమరిది రిసీవ్ చేసుకునేందుకు విజయవాడ రైల్వేస్టేషన్​కు ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు వెళ్లారని వివరించారు. అప్పటి నుంచి వారి ఫోన్లు పనిచేయటం లేదని తెలిపారు. అతని బావమరిది కారు మాత్రం రైల్వేస్టేషన్​లో పార్కింగ్ చేశారన్నారని చంద్రశేఖర్ చెప్పారు.

సుబ్రహ్మణ్యం తెలంగాణలో నివసించటానికి సహాయపడ్డాడని టీవీవీ రాష్ట్ర బాధ్యునిపై కేసు నమోదు చేసి తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. మూడేళ్ల కిందట అరెస్టై బెయిల్ తీసుకుని, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి షెల్టర్ ఇవ్వటం ఏవిధంగా నేరమవుతుందని చంద్రశేఖర్ ప్రశ్నించారు. తప్పుడు సమాచారం ద్వారా అదుపులోకి తీసుకున్నవారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... కొవిడ్ కేర్ సెంటర్లలో ఆకలి కేకలు.. పౌష్టికాహారం పక్కదారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.