సచివాలయంలో నేషనల్ రూర్బన్ మిషన్ పై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఎంపవర్ కమిటీ సమావేశం జరిగింది. నేషనల్ రూర్బన్ మిషన్ కింద ఎంపిక చేసిన గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో కనీస సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదిత పథకాలన్నిటినీ సకాలంలో పూర్తిచేయాలని సీఎస్ స్పష్టం చేశారు. పథకం కింద ఎంపిక చేసిన గ్రామాలు, గిరిజన గ్రామాల్లో ప్రతిపాదించిన పనులన్నీ శరవేగంగా పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మైదాన ప్రాంతాల్లో 25వేల నుంచి 50వేల జనాభా కలిగిన గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో 5వేల నుంచి 15వేల జనాభా గల ప్రాంతాలను క్లస్టర్లుగా ఎంపిక చేయనున్నారు. ఈ క్లస్టర్లలో 60శాతం కేంద్రం,40శాతం రాష్ట్ర నిధులతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేషనల్ రూర్బన్ మిషన్ కింద 12 క్లస్టర్లను మూడు దశలుగా 1130 కోట్ల రూపాయలతో 10వేల 364 పనులు చేపట్టి వీటిని అభివృద్ధి చేయనున్నారని సీఎస్ పేర్కొన్నారు.
రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజెండా అంశాలైన ఏలూరు క్లస్టర్ డీపీఆర్, రంపచోడవరం క్లస్టర్ రివైజడ్ అనుమతుల గురించి వివరించారు. సింగరాయకొండ, కుప్పం, అరకులోయ, ఆలూరు, చందర్లపాడు, గరివిడి, నందలూర్, న్యూజెండ్ల రివైజడ్ డీపీఆర్ లకు ఆమోదం తెలిపారు. ఇంకా నేషనల్ రూర్బన్ మిషన్ కు సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు.
ఇదీచదవండి