ప్రకాశం బ్యారేజీ (Prakasam barrage)కి వరద నీరు చేరుతోంది. పులిచింతల (pulichintala project) నుంచి బ్యారేజీకి 7,400 క్యూసెక్కుల వరద నీరు రాగా.. కీసర నుంచి మరో 1,200 క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. పులిచింతలలో తెలంగాణ జెన్‌కో (telangana genco ) విద్యుదుత్పత్తి చేస్తూ 7,400 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రకాశం బ్యారేజీ అధికారులు.. ఐదు గేట్ల ద్వారా 8,600 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి వచ్చే వరద నీటి ఆధారంగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
ఇదీ చదవండి
AP-TS-WATER ISSUE: ప్రాజెక్ట్‌ల వద్ద కొనసాగుతున్న పోలీసుల పహారా