ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు.. ప్రమాదాల నివారణపై అవగాహన

రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో అగ్నిప్ర‌మాదాలు జరగ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై విస్తృత ప్ర‌చారం చేపట్టింది.

Fire Varothsavalu
అగ్నిమాపక వారోత్సవాలు
author img

By

Published : Apr 14, 2021, 10:11 PM IST

రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అగ్నిప్ర‌మాదాలు సంభ‌వించ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై విస్తృత ప్ర‌చారాన్ని ఆ శాఖ చేపట్టింది. విద్యుత్తు ఉప‌క‌ర‌ణాలు వినియోగించే స‌మ‌యం, ఇత‌ర ప‌రిస్ధితులలోనూ సంభ‌వించే ప్ర‌మాదాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సిన తీరును వివ‌రించింది. ఈ వారోత్సవాలు నేటి నుంచి ఈ నెల 20 వరకు నిర్వహించనున్నారు.

కృష్ణా జిల్లాలో..

విధి నిర్వహణలో మృతిచెందిన అగ్నిమాపక సిబ్బందికి అధికారులు నివాళులర్పించారు. విజయవాడ అగ్నిమాపక ప్రధాన కార్యాలయంలో ఫైర్ సర్వీస్ వీక్​ను ఆ శాఖ డైరక్టర్ జయరాం నాయక్ ప్రారంభించారు. అగ్నిప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రమాదాల్లో బాధితులను రక్షించడం, మంటలు త్వరితగతిన అదుపులోకి తెచ్చేందుకు అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: లోకమాన్య తిలక్​ ఎక్స్​ప్రెస్​లో అగ్ని ప్రమాదం

గన్నవరంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక తహసీల్దార్ నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులు, ప్రజలకు అగ్నిమాపకశాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు అవగాహన కల్పించారు. విధిలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి అధికారులు నివాళులు అర్పించారు.

కడప జిల్లాలో..

తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడటంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ముందుంటారని జిల్లా అగ్నిమాపక అధికారి హనుమంతరావు అన్నారు. కడప అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. అగ్ని ప్రమాదాలకు నివారణకు సంబంధించి ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం అగ్ని నిరోధక పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.

ప్రకాశం జిల్లాలో...

వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని.. వాటి నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను యర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మూర్తి రెడ్డి కోరారు. స్థానికంగా ప్రారంభించిన అగ్నిమాపక వారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు అగ్నిమాపక కేంద్రంలోని పరికరాలను పరిశీలించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలను కొనియాడారు.

విశాఖ జిల్లాలో..

ప్ర‌జ‌ల అప్ర‌మ‌త్త‌తే అగ్నిప్రమాదాల న‌ష్టాల‌ను ఎక్కువగా నివారిస్తుంద‌ని ప్రాంతీయ అగ్నిమాప‌క అధికారి భాను ప్ర‌కాష్ అన్నారు. విశాఖలో అగ్నిమాప‌క వారోత్స‌వాలను భాను ప్రకాశ్ ప్రారంభించారు. విశాఖలోని అన్ని అగ్నిమాప‌క కేంద్రాల వ‌ద్ద ఎటువంటి లోపాలు లేకుండా చూస్తున్నామ‌ని వివ‌రించారు. వారం పాటు అన్ని ప్ర‌దేశాల్లోనూ ప్ర‌జ‌ల్లో మ‌రింత‌గా అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన‌ట్టు ఆయన తెలిపారు. ఇందులో స్దానిక ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు అవకాశం క‌ల్పిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

గుంటూరు జిల్లాలో..

తెనాలిలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు. అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరిస్తున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని.. నిర్లక్ష్యం వహిస్తే భారీ ఆస్తి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని స్థానిక అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు హెచ్చరించారు. సంబంధిత యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 4,157 కేసులు, 18 మరణాలు

'భారతే ముఖ్యం.. పాక్​కు పరిమిత సహకారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.