విజయవాడ ఆటోనగర్‌లోని వందడుగుల రోడ్డు సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లారీ స్క్రాప్ దుకాణాల ప్రాంగణంలోని పాతటైర్లు నిల్వ ఉంచే దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో టైర్లు ఎక్కువగా ఉండటంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి... దట్టమైన పొగలు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది.. ఆరు అగ్నిమాపక వాహనాలతో సుమారు రెండు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా టైర్లు పూర్తిగా కాలిపోయి దట్టమైన పొగలు వ్యాపించటం వల్ల ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో చుట్టుపక్కల దుకాణదారులు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక ఉన్నతాధికారులు దగ్గరుండి మంటలు అదుపు చేసే ప్రక్రియను పర్యవేక్షించారు. ముందుగా రెండు అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ వాటి వల్ల కాకపోవడంతో మరో నాలుగింటిని తెప్పించి మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎంతమేరకు ఆస్తి నష్టం జరిగిగింది అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి...