fire accident: విజయవాడలోని పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం - vijayawada latest news
విజయవాడలోని ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

అగ్నిప్రమాదం
విజయవాడ(vijayawada) నగర శివారు సూరంపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. కొబ్బరి చిప్పల నుంచి నూనే తీసే పరిశ్రమలో మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న అజిత్ సింగ్ నగర్ అగ్నిమాపక సిబ్బంది... సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. రెండు రోజుల వరుస సెలవులు కావటం, పరిశ్రమలో ఎవరు లేకపోవటంతో ప్రాణనష్టం తప్పింది. కానీ భారీగా ఆస్తి నష్టం జరగవచ్చని అంచనా వేశారు.
విజయవాడలోని పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం