కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో అగ్నిప్రమాదం సంభవించింది. నిడమానూరు మోడల్ డైరీ సమీపంలో ఆస్ట్రల్ పైప్స్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. విజయవాడ సెంట్రల్ ఏసీపీ ఖాదర్ బాషా, పటమట పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు.
ఇదీచదవండి..