ETV Bharat / city

కూతురు పాలిట యమపాశమైన తండ్రి - father killed his child in gongulur tandat

కుటుంబాన్ని పోషించలేని ఓ తండ్రి అసహాయత ఆ చిన్నారి పాలిట శాపమైంది. లాక్​డౌన్​ వల్ల మరింత పెరిగిన ఆర్థిక భారం ఆ కన్నతండ్రిని కర్కశంగా మార్చింది. అమ్మమ్మ పక్కన హాయిగా నిద్రిస్తున్న ఆ పాపకు మద్యానికి బానిసైన నాన్నే యమపాశమయ్యాడు.

father-killed-his-child-in-sangareddy-district
కూతురు పాలిట యమపాశమైన తండ్రి
author img

By

Published : May 3, 2020, 7:24 AM IST

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులుర్ తండాలో దారుణం చోటుచేసుకుంది. తండాకు చెందిన రమావత్​ జీవన్​ తన కుమార్తెను హతమార్చిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.

మద్యానికి బానిసైన జీవన్ కుటుంబ పోషణ భారం కావడం వల్ల తరచూ మనోవేదనకు గురయ్యేవాడు. లాక్​డౌన్​ వల్ల ముగ్గురు పిల్లలను (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) పోషించడం మరింత కష్టంగా మారింది. ముగ్గురిలో ఒకర్ని హతమారిస్తే కొంత ఆర్థిక భారం తగ్గుతుందని జీవన్​ భావించాడు. అర్ధరాత్రి సమయంలో.. అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న చిన్న కుమార్తె అవంతిక గొంతుకోసి హత్య చేశాడు.

అనంతరం ఏమీ ఎరగనట్టు చిన్నారికి ఏమైందో చూడండి అంటూ కుటుంబ సభ్యులను లేపాడు. అనుమానం వచ్చిన జీవన్​ భార్య రేణుక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తానే గొంతు కోసి కుమార్తెను హత్యచేసినట్లు పోలీసుల వద్ద జీవన్​ ఒప్పుకున్నాడు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్​కు పంపినట్లు సీఐ శ్రీనివాస్​ తెలిపారు.

ఇవీ చూడండి...

ఇళ్లు గడవాలంటే వేటకు వెళ్లాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.