ETV Bharat / city

'కూతురు'పై అత్యాచారం.. 20ఏళ్ల జైలు శిక్ష - బాలికపై అత్యాచారం కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష

వరుసకు కూతురు అన్న ఇంగిత జ్ఞానాన్ని మరిచి.. అత్యాచారం చేసిన దుర్మార్గుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం. గత ఏడాది జరిగిన ఘటనపై బాధితురాలని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఇప్పుడు కోర్టు శిక్షను విధించింది.

father-jail-in-raped-daughter-case
father-jail-in-raped-daughter-case
author img

By

Published : Dec 3, 2019, 10:08 AM IST

కుమార్తె వరసయ్యే బాలిక(15)పై అత్యాచారం చేసిన కేసులో ఓ నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్‌ న్యాయస్థానం న్యాయమూర్తి జి.ప్రతిభాదేవి తీర్పు చెప్పారు. విజయవాడ ఇబ్రహీంపట్నానికి చెందిన సైకం కృష్ణారావు (54) గతంలో ఉయ్యూరు చక్కెర పరిశ్రమలో పని చేస్తుండేవాడు. భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్న ఓ మహిళతో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నాడు. దేవుని ఫొటో ముందు ఆమె మెడలో తాళికట్టాడు. ఇద్దరూ భార్యభర్తలుగా ఇబ్రహీంపట్నంలో జీవనం సాగిస్తున్నారు. మహిళకు ఉన్న పిల్లల్లో పదో తరగతి చదువుతున్న బాలికపై 2018 జనవరి 27న కృష్ణారావు అత్యాచారం చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి చెప్పగా.. నిందితుడు వారిద్దర్నీ బెదిరించి పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు కేసు విచారణ చేసిన న్యాయస్థానం.. 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఇవి కూడా చదవండి:

ఉల్లి ధరలు...సరికొత్త రికార్డులు !

Intro:Body:

'కూతురు'పై అత్యాచారం - 20ఏళ్ల జైలు శిక్ష

బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం. కుమార్తె వయస్సు ఉన్న బాలికపై 54 సవంత్సరాల కృష్ణారావు గత ఏడాది అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె తల్లి పోలీసులకు ఆశ్రయించింది. ఈ కేసులో నిందితుడికి ఇప్పుడు శిక్ష పడింది.

కుమార్తె వరసయ్యే బాలిక(15)పై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్‌ న్యాయస్థానం న్యాయమూర్తి జి.ప్రతిభాదేవి సోమవారం తీర్పు చెప్పారు. విజయవాడ ఇబ్రహీంపట్నంకు చెందిన సైకం కృష్ణారావు (54) గతంలో ఉయ్యూరు చక్కెర పరిశ్రమలో పని చేస్తుండేవాడు. భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్న ఓ మహిళతో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నాడు. దేవుని ఫొటో ముందు ఆమె మెడలో తాళికట్టాడు. ఇద్దరూ భార్యభర్తలుగా ఇబ్రహీంపట్నంలో జీవనం సాగిస్తున్నారు. మహిళకు ఉన్న పిల్లల్లో పదో తరగతి చదువుతున్న బాలికపై 2018 జనవరి 27న కృష్ణారావు అత్యాచారం చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో.. నిందితుడు వారిద్దర్నీ బెదిరించి పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు.

Conclusion:

For All Latest Updates

TAGGED:

taza
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.