ETV Bharat / city

'సుబాబుల్ రైతుల సమస్యలు పరిష్కరించాలి' - farmers union meeting at vijayawada

జామాయిల్​, సుబాబుల్​, సరుగుడు రైతుల సమస్యల పరిష్కారానికై విజయవాడలో సామాజిక వన రైతుల సంఘం ఆధ్వర్యంలో వామపక్ష రైతు సంఘాలు సమవేశమయ్యాయి. పరిశ్రమలు రైతుల వద్ద కాకుండా.. ప్రైవేట్ ఏజెంట్​ల నుంచి పంట కొనుగోలు చేయటంతో రైతులు నష్టపోతున్నారని రైతు సంఘం నాయకులు అన్నారు.

farmers union meeting to solve the problems of River tamarind farmers problems

author img

By

Published : Mar 31, 2021, 4:03 PM IST

జామాయిల్, సుబాబుల్, సరుగుడు రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘాలు డిమాండ్​ చేశాయి. విజయవాడలో సామాజిక వన రైతుల సంఘం ఆధ్వర్యంలో వామపక్ష రైతు సంఘాల నేతలు సమవేశం నిర్వహించారు. భాజపా ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యతనిస్తోందని ఆరోపించారు. అందులో భాగంగా జీవో 143 ,430లను జారీ చేశారని కౌలు రైతు సంఘం నాయకులు కేశవరావు అన్నారు.

ఈ జీవోల కారణంగా పరిశ్రమలు రైతుల నుంచి కాకుండా.. ప్రైవేట్ ఏజెంట్​ల వద్ద నుంచి పంట కొనుగోలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుబాబుల్ కర్ర కొనాలని అగ్రిమెంట్ ఉన్నా కూడా ప్రైవేట్ ఏజెంట్ల దోపిడీ ఎక్కువైపోయిందని రైతు సంఘాల నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పరిశ్రమల యాజమాన్యంతో పంటను కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి:

వైఎస్​ఆర్​ బీమా రూ.254 కోట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.