వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. రైతులు దిల్లీలో నిరసనలు తెలుపుతున్నా ప్రధానికి కనికరం కలగడం లేదని సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. నల్ల చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేవరకు నిరసనలు కొనసాగిస్తామన్నారు.
రైతు సంఘాల్లో చీలిక తెచ్చి.. ట్రాక్టర్ల ర్యాలీలో విధ్వంసానికి పాల్పడిన సంఘవిద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాధ్ అన్నారు. కర్మాగారాన్ని కాపాడేందుకు దిల్లీలో ఉద్యమించడానికి సిద్ధమని చెప్పారు.
ఇదీ చదవండి: