కేంద్ర బడ్జెట్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ విజయవాడ రానున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు విజయవాడకు కేంద్ర మంత్రి చేరుకోనున్నారు. అనంతరం విజయవాడ నగరంలోని వెన్యూ కన్వెన్షన్ హాల్లో రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు, ఇతర ముఖ్యులతో నిర్వహించే అవగాహనా సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు ఏపీ ఛాంబర్స్‌కు చెందిన ప్రతినిధులతోనూ మంత్రి సమావేశం కానున్నారు. అనంతరం రాత్రి 9 గంటలకు తిరిగి దిల్లీ బయల్దేరి వెళ్ళనున్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: