ETV Bharat / city

16 వేల ఫలితాలకు ఎదురుచూపులు - ap corona positive cases latest news

కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్నవారి నుంచి సేకరించిన నమూనాల్లో ఇంకా 16,235 వరకు ఫలితాలు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 57,747 నమూనాలు సేకరించగా బుధవారం ఉదయం వరకు 41,512 ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 40,799 నెగిటివ్‌ రాగా.... 813 పాజిటివ్‌ అని తేలింది. పలు జిల్లాల్లో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న కేసులు కనిష్ఠంగా 469 నుంచి గరిష్ఠంగా 2,664 వరకు ఉన్నాయి.

corona results
16 వేల ఫలితాలకు ఎదురుచూపులు
author img

By

Published : Apr 23, 2020, 6:30 AM IST

రాష్ట్రంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారి నుంచి సేకరించిన నమూనాల్లో ఇంకా 16,235 వరకు ఫలితాలు రావాల్సి ఉంది. కేసులు కనిష్ఠంగా 469 నుంచి గరిష్ఠంగా 2,664 వరకు ఉన్నాయి.

విశాఖలో గరిష్ఠంగా నమూనాల సేకరణ

రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్నంలో 5,781 మంది నుంచి నమూనాలు సేకరించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న కేసులు 2వేలకు పైగా ఉన్నాయి. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలకు తీసుకొచ్చినా.. నమూనాల సేకరణకు ఒకటి, రెండు రోజులు ఆగాల్సి వస్తోంది. సేకరించిన నమూనాల్లో కొన్ని ఇంకా రికార్డుల్లోకి ఎక్కాలి.

గుంటూరులో వచ్చినవి వచ్చినట్లు

గుంటూరు నగరంలో ఇప్పటివరకు తీసిన నమూనాలన్నింటినీ పరీక్షించి ఫలితాలు ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నరసరావుపేటలో కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రదేశం నుంచే ‘పూల్‌ టెస్టింగ్‌’ విధానంలో నమూనాలు సేకరించి పరీక్షించగా పాజిటివ్‌గా వచ్చాయి.

ప్రకాశం ఫలితాల వెల్లడిలో జాప్యం

ప్రకాశం జిల్లాలో సేకరించిన నమూనాలను గుంటూరు వైరాలజీ ల్యాబుకు పంపుతున్నారు. గుంటూరులో వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఇక్కడి నమూనాలనే తక్షణం పరీక్షిస్తున్నారు. దీనివల్ల ప్రకాశం నమూనాల ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. రాష్ట్రస్థాయి గణాంకాల్లో ఈజిల్లా నుంచి 754 ఫలితాలు రావాలని చెప్పినా, అక్కడి అధికారులు మాత్రం 1500 ఫలితాలు రావాలన్నారు.

కర్నూలులోనూ ఇంతే

కర్నూలు జిల్లాలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇక్కడ సేకరించే నమూనాలను పలుచోట్లకు పంపుతున్నారు. ఇందులో ఐసీఎంఆర్‌ ఆమోదం తెలిపిన ఓ ప్రైవేటు ల్యాబు కూడా ఉంది. కర్నూలు బోధనాసుపత్రిలోనూ పరీక్షల ప్రారంభానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా పరీక్షల్లో రాష్ట్రం అగ్రగామి: ప్రభుత్వం

ప్రతి పది లక్షల మందికిగాను అత్యధికంగా కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల మంది జనాభాకు గాను 830 మందికి రోగ నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది. ఏపీ తర్వాత ఈ పరీక్షల సంఖ్య రాజస్థాన్‌లో అత్యధికంగా ఉందని వివరించింది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్‌లు ఉన్నాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం వరకు మొత్తం 41,512 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని ప్రకటనలో ప్రస్తావించింది.

ఇదీ చూడండి: 'కరోనా పరీక్షల్లో ర్యాపిడ్​ కిట్స్​ నాణ్యతే కీలకం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.