కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా వ్యాయమ ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కూరగాయల మార్కెట్లలో ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూసే బాధ్యతను వారికి అప్పగించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాయమ ఉపాధ్యాయులు సంబంధిత తహశీల్దార్లను సంప్రదించాలని సూచించింది.
ఇదీచదవండి