ETV Bharat / city

Srinivas Goud: నూతన మద్యం పాలసీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్​ క్లారిటీ... - కొత్త మద్యం విధానం

నూతన మద్యం పాలసీలో దరఖాస్తుల ధర, లైసెన్స్ ఫీజులను పెంచలేదని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కొత్త మద్యం విధానంతో అన్ని వర్గాలకు లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒకవ్యక్తి ఎన్ని దుకాణాలకైనా పోటీ పడవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

author img

By

Published : Nov 9, 2021, 7:38 PM IST

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఒకవ్యక్తి ఎన్ని దుకాణాలకైనా పోటీ పడవచ్చని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. రిజర్వేషన్లు కల్పించడం ద్వారా స్థానికులకే దుకాణాలు దక్కేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. కొత్త మద్యం పాలసీలో దరఖాస్తుల ధర, లైసెన్స్‌ ఫీజు పెంచలేదని స్పష్టం చేశారు. మద్యం దుకాణాల్లో గౌడలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సీఎంను కోరినట్లు మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వానికి డబ్బు చెల్లించే వాయిదాలను కూడా పెంచినట్లు మంత్రి తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ తగ్గించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గుడుంబాను పూర్తి స్థాయిలో అరికట్టామన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి బెడద పెరిగిందని అన్నారు. గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గంజాయి రవాణాకు సంబంధించి సమాచారం తెలిపే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అసైన్డ్‌ భూముల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తే ఆ భూములు లాక్కుని వేరేవాళ్లకు కేటాయిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

ఇంతకు ముందు ఓకే వర్గం వారు వైన్ షాపుల్లో దందాలు నడిపేవారు. ఇష్టానుసారంగా కల్తీ మద్యం అమ్మేవారు. ఇక ఇప్పటి నుంచి అలా కుదరదు. అన్ని వర్గాలకు అవకాశం కల్పించడమే మా ప్రభుత్వం లక్ష్యం. కొత్త మద్యం విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చాం. మేం దరఖాస్తు రుసుం కూడా పెంచలేదు. ఒక్కరు ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. బ్యాంక్ గ్యారంటీ కూడా తగ్గించాం. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించే వాయిదాలు పెంచాం. లైసెన్స్ ఫీజు కూడా పెంచలేదు. ఎక్కువ లాభాలు వచ్చేలా చర్యలు చేపడుతున్నాం. రిజర్వేషన్ల ద్వారా స్థానికులకే అవకాశం కల్పిస్తున్నాం. గుడుంబాను పూర్తిగా అరికట్టగలిగాం. పక్క రాష్ట్రంలో గంజాయి సాగు ఎక్కువుంది. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. మత్తు పదార్థాలు, గంజాయి ఇతర దేశాల నుంచి రాకుండా చూడాలని కేంద్రాన్ని కోరతాం. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే గంజాయిని అరికడతాం. నూతన ఎక్సైజ్ విధానంలో రిజర్వేషన్లపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. మన పథకాలను చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో కలపమని అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఏదో ఒక రూపంలో ఆదుకుంటుంది. - శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి

కొత్తగా 404 మద్యం దుకాణాలు

నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ల కార్యాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటారని అధికారులు తెలిపారు. ఆదివారం మినహా మిగిలిన పని దినాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 20న జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయిస్తారు

ఇదీ చూడండి: Petrol Prices: రూ. 10 తగ్గిస్తే ధరలు తగ్గించినట్లేనా: హోంమంత్రి సుచరిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.