ETV Bharat / city

హైకోర్టు చెప్పినా రంగులు ఎందుకు మార్చలేదు?: వడ్డే

స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు సరికాదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఎన్నడూ లేని విధంగా మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో డీజీపీ హైకోర్టుకు సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చిందని మండిపడ్డారు.

హైకోర్టు చెప్పినా వైకాపా రంగులు ఎందుకు మార్చలేదు: వడ్డే

author img

By

Published : Mar 14, 2020, 8:54 PM IST

ప్రభుత్వ పనితీరుపై మాజీ మంత్రి వడ్డే విమర్శలు

హైకోర్టు చెప్పినా ప్రభుత్వం ఇప్పటివరకు పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు మార్చకపోవడానికి కారణం ఏంటని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. విజయవాడ ప్రెస్​క్లబ్​లో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమేనని న్యాయస్థానాలు చెబుతున్నట్లు తెలిపారు. రాజధాని రైతుల భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఇచ్చిన జీవో... సీఆర్డీఏ చట్టానికి వ్యతిరేకమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత వ్యవహారంలో ఎన్నడూ లేని విధంగా డీజీపీ కోర్టుకు వచ్చి సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆగ్రహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు పనితీరు మార్చుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం కొనసాగుతోంది: చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.