వైకాపాకు అధికారం ఇచ్చింది దళుతులే కాబట్టి, వారిపై దాడిచేసే హక్కు తమకుందన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి నక్కాఆనంద్‌బాబు మండిపడ్డారు. న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నం దారుణమన్నారు. ఆయన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉన్నందున దళిత సంఘాలు స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు.
దళితులపై సాగిస్తున్న దమనకాండపై రామకృష్ణ మాట్లాడటం నేరమా అని నక్కా ప్రశ్నించారు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే, పథకం ప్రకారమే దళితులపై దాడులు చేస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. దళితులకు అంబేడ్కర్ కల్పించిన హక్కులను జగన్ ప్రభుత్వం హరించివేస్తోందని ధ్వజమెత్తారు. ఏం చేసైనా సరే దళితులు మాట్లాడకుండా చేయాలన్నట్లుగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
దళిత ప్రజాసంఘాలు, మేథావులు, ప్రజాసంఘాలు రాష్ట్రంలో జరుగుతున్న వాటిపై స్పందించాలని ఆనందబాబు అన్నారు. చంద్రబాబును తలుచుకోనిదే ఈ ప్రభుత్వానికి నిద్రపట్టడంలేదన్న నక్కా.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ రాష్ట్రంలో నిర్వీర్యమవుతున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదన్నారు.
ఇవీ చదవండి...