ETV Bharat / city

'సీబీఐ కేసుల్లో ఉన్నవారికి వాక్సిన్ తయారీ ఇవ్వండి' - ks jawahar tdp leader on vaccine

వ్యాక్సిన్ తయారీ సంస్థలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై.. ట్విట్టర్​లో మాజీ మంత్రి జవహర్ తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. సీబీఐ కేసుల్లో ఉన్న ఫార్మా కంపెనీల వాళ్ళకు ఇస్తే, వాళ్లే వాక్సిన్లు ఎన్నంటే అన్ని తయారు చేసిస్తారేమో అని ఆయన విమర్శించారు.

మాజీ మంత్రి జవహర్
మాజీ మంత్రి జవహర్
author img

By

Published : May 13, 2021, 10:46 PM IST

  • మనం కన్నెర్ర చేస్తే గంగవరం, కృష్ణ పట్నం పోర్టు ఓనర్లు వనుక్కొంటూ వెళ్లి అయిన కాడికి మనోడికి వాటిని అమ్మేసి పోయారు. మొండికేసిన సంగం డైరీ చైర్మన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టాం. మాట వినక పోతే జువారి సిమెంట్, అమర్ రాజా బాటరీస్ కు పొల్యూషన్ నోటీస్ ఇచ్చి మూసేయించాము.
    1/3

    — ksjawahar (@ksjawahar) May 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వ్యాక్సిన్ తయారీ సంస్థలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్​లో మాజీ మంత్రి జవహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గంగవరం, కృష్ణ పట్నం పోర్టు ఓనర్లను లొంగదీసుకున్నట్లు.. జువారి సిమెంట్, అమర్ రాజా సంస్థలకు నోటీసులిచ్చిన తరహాలోనే వ్యాక్సిన్ తయారీ సంస్థల్ని లొంగతీసుకోవటం సాధ్యం కాదు అంటూ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్​లో వ్యాక్సిన్ తయారు చేస్తుంటే తాడేపల్లిలో వాసన వస్తోందని కేసు పెట్టలేకపోతున్నారా అని విమర్శలు గుప్పించారు. లేదంటే సంగం డైరీలో సర్వర్లు లాక్కొచ్చినట్లు వ్యాక్సిన్ సంస్థ సర్వర్లు పట్టుకొచ్చే వారా అని ప్రశ్నించారు. సీబీఐ కేసుల్లో ఉన్న ఫార్మా కంపెనీల వాళ్ళకు ఇస్తే, వాళ్లే వాక్సిన్లు ఎన్నంటే అన్ని తయారు చేసిస్తారేమో అంటూ ఆయన దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

3 ప్రభుత్వ ఆసుపత్రుల్లో... ఆక్సిజన్ పడకల తగ్గింపు?

డౌన్​లోడ్​లో జియో జోరు​- అప్​లోడ్​లో వొడాఫోన్ టాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.