కొవిడ్ విధుల్లో మృతి చెందిన వైద్యారోగ్య సిబ్బంది కుటుంబ సభ్యులకు పరిహారాన్ని చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరీల వారీగా ఈ పరిహారం మొత్తాన్ని నిర్ధరిస్తూ వైద్యారోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. కొవిడ్ విధులు నిర్వహిస్తూ వైద్యులు మృతి చెందితే..రూ. 25 లక్షలు, స్టాఫ్ నర్సులకు రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఎంఎన్ఓ(MNO), ఎఫ్ఎన్ఓ(FNO)లకు రూ.15 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం నిర్ధేశించింది. ఇతర వైద్యారోగ్య సిబ్బందికి రూ. 10 లక్షల పరిహారం నిర్ధరిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఇచ్చే పరిహారానికి అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పరిహారం కేవలం కొవిడ్ విధుల్లో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీచదవండి
Mansas Trust: ఇప్పటికైనా ప్రభుత్వం.. చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి: అశోక్ గజపతిరాజు