CORONA AND DENGUE: కొవిడ్ నుంచి బయటపడ్డామని.. ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు అన్నారు. కొత్త వేరియంట్ వస్తే తప్ప కొవిడ్ కథ ముగిసినట్లేనని చెప్పారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ఆహారం, నీరు కలుషితం కాకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆహారం, నీరు కలుషితమైతే విష జ్వరాలు ప్రబలే అవకాశముందని.. అప్రమత్తంగా ఉండాలంటున్న డీహెచ్ శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ప్రజలు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం చేపట్టాలి. వేడి వేడి ఆహారం తీసుకోవాలి. నీరు రంగు మారితే తప్పక కాచి చల్లార్చేకే తాగాలి. ప్రజలు జలుబు, జ్వరం, విరేచనాలు, జలుబు ఉంటే వైద్యులను సంప్రదించాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వ్యాధుల టెస్ట్ కిట్‌లు సిద్ధంగా ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ రోగులకు కావాల్సిన అన్ని చర్యలు చేపట్టింది. బాలింతలు, చంటి పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలి. జలుబు, జ్వరం ఉంటే ఇంట్లోనే ఉండాలి ఐసోలాషన్ పాటించాలి. గత ఆరు వారాలుగా కొవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. కరోనాకు సంబంధించి భయపడాల్సిన పని లేదు. కొవిడ్ ఎండమిక్ దశకు చేరుకుంది. సాధారణ జలుబు, జ్వరం లక్షణాలు ఉంటాయి. కొవిడ్ కూడా ఒక సీజనల్ వ్యాధిగా మారిపోయింది. కొవిడ్ లక్షణాలు ఉంటే కేవలం 5 రోజులే క్వరంటాయిన్‌లో ఉండాలి. లక్షణాలు లేని వారికి నిర్ధారణ పరీక్షలు అక్కర్లేదు. లక్షణాలు తగ్గిన తరువాత ఐసోలేషన్ అక్కర్లేదు. కొవిడ్ నిదబంధనలు తప్పక పాటించాలి. శ్వాసకోశ ఇబ్బందులు ఉంటే మాత్రమే కొవిడ్ సోకిన వారు ఆసుపత్రిలో చేరాలి. కొత్త వేరియంట్ వస్తే తప్ప కొవిడ్ కథ ముగిసినట్టే. -- శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు
ఇదీ చదవండి: