ETV Bharat / city

ఇంజనీరింగ్‌ కళాశాలల బోధనా రుసుముల ఖరారు ! - ఏపీలో ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజులు

ఇంజినీరింగ్‌ కళాశాలల బోధన రుసుముల కసరత్తు.... ఓ కొలిక్కి వచ్చింది. 35 వేలు నుంచి 82 వేల రూపాయల వరకూ రుసుముగా... ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ నిర్ణయించనుంది. వీటిని ప్రకటించాకే.. ఇంజినీరింగ్‌ కౌన్సిలింగ్ ఐచ్ఛికాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.... నాణ్యత ప్రమాణాలు పాటించని కళాశాలల్లో ప్రవేశాల నిలిపివేతకు సిద్ధమైన ఉన్నత విద్యామండలి పలు కళాశాలల్లో కోర్సులనూ కుదించింది.

ఇంజనీరింగ్‌ కళాశాలల బోధనా రుసుముల ఖరారు
ఇంజనీరింగ్‌ కళాశాలల బోధనా రుసుముల ఖరారు
author img

By

Published : Nov 4, 2020, 4:26 AM IST

ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌...ఇంజనీరింగ్‌ కళాశాలల్లో బోధన రుసుములను దాదాపు ఖరారు చేసింది. ఒక ప్రత్యేక కళాశాలకు 90 వేలు, మరో దానికి 95 వేలుగా నిర్ణయించినట్లు తెలిసింది. గతేడాది గరిష్ఠంగా బోధనా రుసుము 70 వేలు ఉండగా.... ఈసారి కాస్త పెంచారు. విశ్వవిద్యాలయాల నుంచి కళాశాలల అనుబంధ గుర్తింపు జాబితా వచ్చిన వెంటనే ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ఇప్పటికే జేఎన్టీయూ- కాకినాడ కళాశాలల జాబితాను సిద్ధం చేయగా... జేఎన్టీయూ- అనంతపురం జాబితాకు మరో 2 రోజులు సమయం పట్టే అవకాశముంది.

2017-18 వరకూ వర్సిటీలకు అనుబంధ గుర్తింపు ఫీజులు చెల్లించని కళాశాలలపై చర్యలు తీసుకునేందుకూ కసరత్తు జరుగుతోంది. జేఎన్టీయూ- అనంతపురం పరిధిలో 125 కళాశాలలు ఉండగా...ఇందులో పద్నాలుగింట్లో 25 శాతంలోపు ప్రవేశాలున్నాయి. వీటికి ఈ ఏడాదికి..అనుబంధ గుర్తింపు నిలిపేయాలా లేక కోర్సులు తగ్గించాలా అన్న దానిపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని సుమారు 55 కళాశాలలకు బోధనా రుసుమును నిర్ణయించలేదు. ఈ ఏడాది అఖిల భారత సాంకేతిక విద్యామండలి...274ప్రైవేటు కళాశాలలకు అనుమతుల మంజూరు చేసింది. వీటిలో కొన్నింటికి వర్సిటీల అనుబంధ గుర్తింపు నిలిపేస్తే...కౌన్సిలింగ్‌కు సిద్ధమయ్యే వాటి సంఖ్య 219కి తగ్గనుంది.

రాష్ట్రంలో 48ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతులను ఉన్నత విద్యామండలి రద్దు చేసింది. మరో 61కళాశాలల్లో భారీగా కోర్సులను కుదించింది. రాష్ట్రంలో మూడేళ్లుగా వర్సిటీల అనుబంధ గుర్తింపు, ప్రవేశాలు లేని....25 శాతంలోపు విద్యార్థులున్న 246 కళాశాలలకు గతంలోనే ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీనిపై కళాశాలల యాజమాన్యాలు విచారణ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చాయి.

విశ్వవిద్యాలయం పేరు అనుమతి రద్దు కోర్సుల కుదింపు
ఆదికవి నన్నయ్య 7 17
ఆచార్య నాగార్జున 7 9
ఆంధ్ర 12 3
కృష్ణా 4 -
రాయలసీమ 1 9
శ్రీవేంకటేశ్వర 11 4
యోగివేమన 6 4
విక్రమ సింహపురి - 3
బీఆర్‌ అంబేడ్కర్‌ - 8
శ్రీకృష్ణదేవరాయ - 4

డిగ్రీలో తొలిసారిగా ఈ ఏడాది ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ప్రవేశాలకు సంబంధించి 7న ప్రకటన విడుదల చేసి..... రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి 85 కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు.

ఇదీచదవండి

జగన్ అక్రమాస్తుల కేసు.. విచారణ నేటికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.