అర్చకుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అర్చక సంఘాల ప్రతినిధులతో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. అర్చకులకు 25 శాతం జీతాలు పెంచనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వం నిర్వహణపై కీలకంగా చర్చించామని... త్వరలోనే 21 అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ధార్మిక పరిషత్ ఏర్పాటు.. అర్చకులకు హెల్త్‌కార్డులు, జీవో 76 అమలుపై చర్చించినట్లు వెల్లంపల్లి తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ్ కల్లాం, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు
ఇవీ చూడండి-వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి