రాష్ట్రంలో 10,143 ప్రభుత్వోద్యోగాల భర్తీకి ఈ ఏడాది జూన్‌లో ముఖ్యమంత్రి జగన్ జాబ్ క్యాలండర్(cm jagan on job calendar) విడుదల చేశారు. పోలీసుశాఖలో 450ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరులో నోటిఫికేషన్ ఇస్తామని అందులో వెల్లడించారు. అయితే ఇప్పటివరకూ నోటిఫికేషన్ ఇవ్వకపోవటంపై.. విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 2018 నవంబరు, డిసెంబరు నెలల్లో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు(waiting for the police job notifications)విడుదల అయ్యాయి. అప్పట్లో 334ఎస్సై స్థాయి పోస్టులు, 2,723కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. దాదాపు 5లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2018 తర్వాత మరో నోటిఫికేషన్ లేకపోవటం వల్ల ఇప్పుడు అదే స్థాయిలో ఆశావహులు ఎదురు చూస్తున్నారు.
తొలుత ఏటా 6,500పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని(cm jagan commensts on jobs) ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అయితే ఈ ఏడాది 450పోస్టులే భర్తీ చేస్తామని ప్రభుత్వం(ap job calendar) జాబ్ క్యాలండర్‌లో ప్రస్తావించింది. దీనిపై అప్పట్లో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. వచ్చే జాబ్ క్యాలండర్ నుంచి ఏటా 6500చొప్పున భర్తీ చేస్తామంటూ జులైలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. అయితే కనీసం ఈ ఏడాది భర్తీ చేస్తామని చెప్పిన పోస్టులకైనా.... ప్రకటించిన గడువులోగా నోటిఫికేషన్ ఇవ్వకపోటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి..
CM JAGAN: అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ.. నేడు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్