Employees union Meet CS Sameer Sharma: జీపీఎఫ్‌లో సొమ్ము మాయం అవ్వడంపై ఉద్యోగుల సంఘం నేతలు.. ప్రభుత్వ వివరణ కోరారు. నేతలు సూర్యనారాయణ, ఆస్కార్ రావ్లు.. సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మను కలిశారు. సాంకేతిక కారణాలతోనే నగదు డెబిట్ అయినట్లు అధికారులు చెబుతున్నారని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. అధికారులు చెబుతున్న సమాధానంపై తాము సంతృప్తి చెందలేదని సీఎస్‌కు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు.
"జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురవుతుంటే ఆర్థికశాఖ అధికారులు పిట్ట కథలు చెబుతున్నారు. అధికారులు చెబుతున్న మాటలను ఇతర ఉద్యోగ సంఘాల నేతలు నమ్మినట్లుగా మేము నమ్మట్లేదు. నగదు డెబిట్‌పై న్యాయపోరాటం చేస్తాం. సీఎస్, ఆర్థికశాఖ ఉద్యోగులు, సీఎఫ్‌ఎంఎస్, ప్రిన్సిపల్ అకౌటెంట్ జనరల్‌ను పార్టీగా చేరుస్తాం. అనుమతి లేకుండా మా ఖాతాల నుంచి డబ్బులు తీయడం నేరం. ప్రభుత్వం ఇచ్చిన వివరణ పూర్తిగా అవాస్తవం. డీఏ బకాయిల చెల్లింపుపై గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డీఏ బకాయిలతోనే జీతాలు పెరిగినట్లు గతంలో చెప్పారు. ఇప్పుడు డీఏ బకాయిలు వేయలేదంటున్నారు. వీటిల్లో ఏది నిజం?" అని సూర్యనారాయణ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: