ETV Bharat / city

ఉద్యోగుల మిలియన్​ మార్చ్​.. పని చేయని పోలీసు ఆంక్షలు

విజయవాడ తరలివచ్చారు. చలో విజయవాడకు రాకుండా అడుగడుగునా నిఘాపెట్టి నిర్బంధాలు చేసినా.. తమ కొత్త పీఆర్సీ పై తమ ఆగ్రహాన్ని ఆక్రోశాన్ని చాటారు. ఒక్కసారిగా.. వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు..ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

నిర్భందాలను ఛేదించుకుని విజయవాడకు ఉద్యోగులు

author img

By

Published : Feb 3, 2022, 12:26 PM IST

Updated : Feb 3, 2022, 2:23 PM IST

నిర్భందాలను ఛేదించుకుని విజయవాడకు ఉద్యోగులు

చలో విజయవాడ ర్యాలీకి ఉద్యోగ ఉపాధ్యాయులు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడ చేరుకున్నారు. పోలీసు నిర్బంధాలను ఛేదించుకుని విజయవాడలోని.. ఎన్జీవో భవన్‌ వద్దకు ఒక్కసారిగా వేలాదిమంది ఉద్యోగులు దూసుకొచ్చారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు నినాదాలతో ముందుకు సాగుతున్నారు. అణచివేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందని ఉద్యోగులు హెచ్చరించారు.

పోలీసులు గుర్తు పట్టకుండా మారువేషాల్లో కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. కొందరు రైతు వేషధారణలో.. మరికొందరు కూలీలుగా సంచులు పట్టుకుని విజయవాడ చేరుకున్నారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులను ప్రభుత్వం దగా చేసిందని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. పాత జీతాలు వేస్తే చాలని.. కొత్త పీఆర్సీ వద్దంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. బీఆర్​టీఎస్ రోడ్డుకు చేరుకున్న ఉద్యోగులు, పెన్షనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

నగరంలోని హోటళ్లు, లాడ్జీలను.. .పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఛలో విజయవాడ భాగంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన సుమారు 200 మంది ఉద్యోగులను ఆరెస్టు చేసి అజీత్ సింగ్ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

విజయవాడ నగరంలోకి రాకుండా అన్ని మార్గాలను అష్టదిగ్బంధనం చేశారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు, ఉయ్యూరు మండలంలో పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నేతలను హౌస్ అరెస్టు చేశారు. కంకిపాడు మండలంలోని జాతీయ రహదారిపై దావులూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నందిగామ బైపాస్‌ రోడ్‌లో బారికేడ్లును ఏర్పాటు చేసి.. వాహనాలను తనీఖీలు చేపడుతున్నారు. అనుమానం ఉన్న వ్యక్తి వద్ద సమాచారం సేకరిస్తున్నారు.

చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న.. విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల నుంచి వస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్ గేట్ , గూడపల్లి చెక్ పోస్టు వద్ద సుమారు 50 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని గన్నవరం బాలుర పాఠశాలలో ఉంచారు. న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా పోరాడుతున్న తమపై నిర్బంధకాండ ఏంటని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగ్గయ్యపేట నుంచి విజయవాడ వరకు వెళ్లే జాతీయ రహదారిపై అడుగడుగునా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బస్సులు, కార్లను తనిఖీ చేసి పంపుతున్నారు. జగ్గయ్యపేట నుంచి వోల్వో బస్సులో వెళ్తున్న జిల్లా వీఆర్​ఓ ల సంఘం అధ్యక్షుడు రాటకొండ శ్రీనివాసరావు సహా నలుగురు ఉద్యోగులను కంచికచర్ల పోలీస్ స్టేష్టన్‌ తరలించారు.

ఇదీచదవండి: ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లడం ఖాయం: ఉద్యోగులు

Last Updated : Feb 3, 2022, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.