ETV Bharat / city

రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు.. ఎంత పెరిగాయంటే..? - ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపు

electricity 1
electricity 1
author img

By

Published : Mar 30, 2022, 12:45 PM IST

Updated : Mar 30, 2022, 3:25 PM IST

12:44 March 30

పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఏప్రిల్ నుంచి అమలు

రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు
రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు

Electricity Tariffs: ఏపీలో విద్యుత్‌ ఛార్జీల మోత మోగింది. కరెంట్‌ ఛార్జీలను పెంచుతూ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయం తీసుకుంది. 30 యూనిట్ల వరకూ ఉన్న స్లాబ్​కు 1.90 రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు. ఈ స్లాబ్​లో యూనిట్​కు 45 పైసల చొప్పున పెంచారు. ఇక 31-75 యూనిట్ల వరకూ ఉన్న స్లాబ్​కు యూనిట్​కు రూ.3 వసూలు చేసుకునేందుకు డిస్కమ్​లకు అనుమతి ఇచ్చారు. ఈ స్లాబ్​లో యూనిట్​కు 91 పైసల చొప్పున పెరుగుదల నమోదు అయ్యింది.

ఇక 76 -125 యూనిట్ల మధ్య ఉన్న స్లాబ్​కు యూనిట్ ధర రూ.4.5 చేశారు. ఈ స్లాబ్​లో వినియోగ దారులకు రూ.1.40 చొప్పున ప్రతి యూనిట్​పై భారం పడనుంది. ఇక 126-225 వరకూ ఉన్న స్లాబ్​లో యూనిట్ ధర రూ.6 పెంచేందుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇచ్చింది. ఒక్కో యూనిట్​కు రూ.1.57 చొప్పున పెరిగుదల నమోదు అయ్యింది. 226-400 యూనిట్ల వరకూ ప్రతీ యూనిట్​కు రూ.8.75 చొప్పున పెంచేందుకు ఈఆర్సీ అనుమతి మంజూరు చేసింది. ఈ స్లాబ్​లో ప్రతీ యూనిట్​కు గతంలో కంటే రూ.1.16 చొప్పున పెరుగుదల నమోదు అయ్యింది. 400 ఆపైన యూనిట్లకుగానూ రూ.9.75 చొప్పున పెంపుదలకు అనుమతి ఇచ్చారు. ప్రతీ యూనిట్​కు 55 పైసల చొప్పున పెంచుతూ ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది.

పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని ఏపీఈఆర్సీ ఛైర్మన్ సీవీ నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు. 5 కేటగిరీలు రద్దుచేసి కొత్తగా 6 శ్లాబులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ధరలు పెంచడం ఇబ్బందైనా.. తప్పని పరిస్థితి నెలకొందన్నారు. పెరిగిన ఛార్జీలతో పంపిణీ సంస్థలకు రూ.1400 కోట్లు అదనపు ఆదాయం చేకూరుతుందని నాగార్జున రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి: బొగ్గు కొరత లేకుండా చూసుకోండి.. ఏపీ ట్రాన్స్​కోకు సూచన

Last Updated : Mar 30, 2022, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.