ETV Bharat / city

మేయరు పీఠం ఆశావహుల డివిజన్లలో పోటీ - విజయవాడలో మున్సిపల్ ఎన్నికలు తాజా వార్తలు

అక్కడ ఓట్లు వేయాలని ఓటర్లకు రూ.1500 చొప్పున ఓ అభ్యర్థి పంపిణీ చేశారు. పోలీంగ్ ముగిసింది.. కానీ, ఆ కాలనీ వాసులు చాలామంది మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేదు. తమ ఏజెంటు ద్వారా తెలుసుకున్న వారు కాలనీకి వెళ్లి తాము ఇచ్చిన సొమ్ము వాపసు ఇవ్వాలంటూ ఆందోళన చేసిన ఘటన విజయవాడ 11వ డివిజన్ పరిధిలో జరిగింది.

elections process in vijayawada
మేయరు పీఠం ఆశావహుల డివిజన్లలో పోటీ
author img

By

Published : Mar 13, 2021, 3:35 PM IST

విజయవాడ 11వ డివిజన్ పరిధిలోని ఓ కాలనీలో ఓట్లు వేసేందుకు.. ఆ కాలనీ వాసులకు ఓటుకు రూ.1500 చొప్పున ఓ అభ్యర్థి తరఫున పంపిణీ చేశారు. పోలింగ్‌ ముగిసింది. కానీ ఆ కాలనీ వాసులు చాలామంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. తమ ఏజెంటు ద్వారా తెలుసుకున్న వారు కాలనీకి వెళ్లి తాము ఇచ్చిన సొమ్ము వాపసు ఇవ్వాలంటూ గోలగోల చేశారు.
నగరంలో గెలుపు అవకాశాలపై ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ శాతాలపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మేయరు పదవి రేసులో ఉన్నవారు తమ గెలుపు అవకాశాలపై తర్జనభర్జన పడుతున్నారు. తెదేపా మేయరు అభ్యర్థిగా శ్వేతను పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. వైకాపాలో పలువురు మేయరు పదవిని ఆశిస్తున్నారు. ముందుగా తమ డివిజనులో పరిస్థితిపై విశ్లేషిస్తున్నారు. డివిజనులో గెలిస్తేనే మేయరు పదవికి పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.

  • తెదేపా అభ్యర్థిని కేశినేని శ్వేత 11వ డివిజను నుంచి పోటీ చేస్తున్నారు. ఈ డివిజను గతంలో మాజీ మేయరు కోనేరు శ్రీధర్‌ ప్రాతినిధ్యం వహించారు. ఆయన తన భార్యను నిలబెట్టాలని భావించారు. కానీ ఎంపీ కూతురు శ్వేత పోటీ చేశారు. ఆమెతోపాటు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ డివిజనులో వైకాపా నుంచి కమ్మిలి శోభారజని పోటీ చేశారు. ఆమె భర్త సత్యనారాయణకు డివిజనులో పట్టుఉంది. ఆయన కొవిడ్‌ వల్ల చనిపోయారు. సానుభూతి పవనాలు ఉన్నాయని వైకాపా అంచనా వేస్తోంది. ఈ రెండు పార్టీలతో పాటు.. జనసేన తరపున పాశం సుజాత పోటీ చేశారు. గ్లాసు ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. తెదేపా, వైకాపాపై ఈప్రభావం పడుతుందని విశ్లేషిస్తున్నారు.
  • వైకాపా నుంచి మేయరు పీఠం డాక్టర్‌ లిఖిత, పుణ్యశీల, శ్రీశైలజ, చైతన్యారెడ్డి ఆశిస్తున్నారు. వారు పోటీ చేస్తున్న డివిజన్లలో సమీకరణాలు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కౌన్సిల్‌లో ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న పుణ్యశీల తనకు సీఎం నుంచి హామీ ఉందని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. మిగతా వారు కూడా తమకు అనుకూలించే అంశాలు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఆమె 34 వడివిజను నుంచి పోటీ చేశారు. ఇక్కడ జనసేన ప్రభావం అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. తెదేపా నుంచి షేక్‌ విజయలక్ష్మికి టిక్కెట్‌ ఇచ్చారు. మొదట పొట్టేటి రమణికి బిఫారం ఇచ్చి తెదేపా టిక్కెట్‌ మార్చింది. వంగవీటి రాధా అనుచరులుగా విజయలక్ష్మికి టిక్కెట్‌ ఇచ్చారు. జనసేన నుంచి ఆకుల రాధారాణి పోటీ చేశారు. తెదేపా అసమ్మతి, సామాజిక వర్గాల సమీకరణ నేతృత్వంలో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా ఉంది. దీంతో ఇక్కడ ఎవ్వరు గెలుస్తారనేదానిపై పందాలు కూడా కడుతున్నారు.
  • వైకాపా నుంచే మేయరు రేసులో ఉన్న మరో అభ్యర్థిని పొన్నూరు లిఖిత. 28 వడివిజను నుంచి రంగంలో ఉన్నారు. గౌతంరెడ్డి కుమార్తె అయిన ఈమెకు సామాజిక వర్గాల సమీకరణలో అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ డివిజను నుంచి తెదేపా తరఫున వీరమాచినేని లలిత పోటీపడుతున్నారు. అయితే ఇక్కడ భాజపా, జనసేన ఇద్దరూ పోటీలో ఉన్నారు. దీంతో విజయవావకాశాలపై ప్రభావం ఉంటుందనేది నేతల అభిప్రాయంగా ఉంది.
  • పశ్చిమలో వైకాపా అభ్యర్థినిగా 42వ డివిజనులో చైతన్యారెడ్డి రంగంలో ఉన్నారు. మేయరు అభ్యర్థినిగా మంత్రి వెలంపల్లి ఈమెకు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ తెదేపా తరపున రమణి, వైకాపా తరపున అనుషా గట్టి పోటీ ఇచ్చారని చెబుతున్నారు. ముక్కోణంలో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠభరితమే.
  • మరో ఆశావాదురాలు వైకాపా తరఫున 58వ డివిజను నుంచి రంగంలో ఉన్నారు. అవుతు శ్రీనివాసరెడ్డి భార్య అవుతు శ్రీశైలజ పోటీ చేశారు. ఈమెకు పోటీగా సీపీఎం నుంచి అనుషా గట్టి పోటీ ఇచ్చారు. తెదేపా నుంచి జగదాంబ, భాజపా నుంచి సూర్యకుమారి పోటీ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలు అటు తెదేపా, ఇటు వైకాపాలతోపాటు. మంత్రి వెలంపల్లికీ ప్రతిష్ఠాత్మకమే.

ఇదీ చదవండి:

జనసేన మద్దతుతో... తిరుపతిలో భాజపా పోటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.