ETV Bharat / city

చివరి దశకు చేరుకున్న పురపోరు... పోటాపోటీగా అధికార, విపక్షాల ప్రచారం - మున్సిపల్ ఎన్నికల ప్రచారం

నగరపాలక ఎన్నికల్లో ప్రచార పర్వం తుదిఘట్టానికి చేరుకుంటోంది. రేపు సాయంత్రానికి మైకులు మూగబోనున్నాయి. అందుకే మిగిలిన ఈరెండు రోజుల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు..... ఆఖరి అస్త్రాలు సంధిస్తున్నాయి. గెలుపుకోసం అన్నీ పార్టీల అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

municipal elections campaign at ap
చివరి దశకు చేరుకున్న పురపోరు
author img

By

Published : Mar 7, 2021, 5:43 AM IST

చివరి దశకు చేరుకున్న పురపోరు

పేదల పక్షాన పనిచేస్తున్న జగన్‌ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు పలకాలని హోంమంత్రి సుచరిత ప్రజలను కోరారు. గుంటూరు గ్రామీణ మండలం ఏటుకూరు, బొంతపాడులో ఆమె ప్రచారం నిర్వహించారు. సంగడిగుంటలోని 21వ వార్డులో వైకాపా అభ్యర్థి తరపున మంత్రి శ్రీరంగనాధరాజు, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపిస్తేనే గుంటూరు నగరం అభివృద్ధి సాధ్యమని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. గుంటూరు 35వ డివిజన్‌ అభ్యర్థి వరప్రసాదరావు తరపున మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి రవీంద్రతో కలిసి ఆయన ఎన్నికలో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి దివ్యవాణి కూడా నగరంలో తెదేపా తరఫున ప్రచారం చేశారు.

ఏలూరులో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 2 ఏళ్లలోనే అనేక సంక్షేమ పథకాలను చేపట్టామంటూ ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మంత్రులు, రాజ్యసభ సభ్యులను వైకాపా ప్రచారంలో దించింది. పటమటలంక 9 వ డివిజన్‌లో ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రచారం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం వైకాపా అభ్యర్ధుల గెలుపునకు దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌తో పాటు సినీనటుడు అలీ డివిజన్‌లలో ప్రచారంలో పాల్గొన్నారు.

సెంట్రల్‌ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఓట్లు అభ్యర్థించారు. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థుల తరఫున పోతిన మహేష్‌ రోడ్‌ షో చేపట్టారు.10వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి దేవినేని అపర్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 59వ డివిజన్‌ సింగ్‌నగర్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమ.... తెదేపాను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. నగరంలో తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి చూసిన ప్రజలు.. తెలుగుదేశంతోనే ఉన్నారని ప్రచారంలో పాల్గొన్న ఎంపీ కేశినేని అన్నారు.

విశాఖ జిల్లా సింహాచలంలో మంత్రి అవంతి ప్రచారం నిర్వహించగా కొందరు తెలుగుదేశం కార్యకర్తలు వైకాపాలో చేరారు. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా, తెలుగుదేశం పార్టీల అభ్యర్థుల ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార పార్టీ తరుపున ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, తెలుగుదేశం అభ్యర్థుల విజయం కోసం కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, టీజీ భరత్‌ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అనంతపురంలో అన్ని పార్టీలు ఉద్ధృతంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నాయి.

కడప నగరపాలక సంస్థ పరిధిలో నేతలు ప్రచారాలను ముమ్మరం చేశారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, మేయర్‌ అభ్యర్థి సురేశ్‌బాబు పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారాలు చేస్తున్నారు. తెలుగుదేశం కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైంది.తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ... సంక్షేమ పథకాలపై నమ్మకం ఉంటే ప్రతిపక్షాలను ఎందుకు బెదిరిస్తున్నారని వైకాపాను ప్రశ్నించారు.

ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు అనుమతుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికారులంతా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ పీఎస్‌ గిరీషా సూచించారు.

ఇదీ చూడండి: వైకాపా అభ్యర్థి తరపున తితిదే ఉద్యోగుల ప్రచారం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.