రేపు కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను వైకాపా సిద్ధం చేసింది. సాయంత్రం 6 గంటలకు మేయర్లు, ఛైర్‌పర్సన్ల జాబితాను వైకాపా ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించనున్నారు. సామాజిక సమీకరణాల మేరకు అభ్యర్థులను అధికార పార్టీ నిర్ణయించింది. పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించి జాబితా సిద్ధం చేశారు. బీసీలు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. పార్టీలో నేతల మధ్య విభేదాలు ఉన్నచోట అభ్యర్థిని సీఎం జగన్ ఎంపిక చేశారు.
ఇదీ చదవండి: వైకాపా నేతల అక్రమాలకు ఏపీలోని జైళ్లు సరిపోవు: ధూళిపాళ్ల