కృష్ణా జిల్లాలో...
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్లో తెదేపా అభ్యర్థి కుప్పల గంగాధర్‌ను బలపరుస్తూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్, నాగుల్‌మీరా పాల్గొన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేసే అభ్యర్థులనే తెదేపా బలపరిచిందని దేవినేని అన్నారు.
కడపజిల్లాలో అన్ని పంచాయతీల్లో ఏకగ్రీవం కావడం ఆ జిల్లాలో రాజా రెడ్డి పరిపాలన వ్యవస్థ నడుస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని.. ప్రభుత్వం వీటి కట్టడిలో విఫలమైందని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలో తెదేపా విజయం నల్లేరుపై నడకేనని ఉమా ధీమా వ్యక్తం చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో...
తూర్పుగోదావరి జిల్లా పురపాలక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కావడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తునిలో మెుత్తం 30 వార్డులకు గాను.. 15 వార్డులను వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవాలతో దక్కించుకున్నారు.
మిగిలిన 15 వార్డుల్లో పోటీలో ఉన్న వైకాపా అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి పార్టీ నేతలు తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'అభ్యర్థులకు తెలీకుండానే ఉపసంహరణలు.. ఆమోదిస్తే కోర్టుకు వెళ్తాం'