EK SHAM CHARMINAR KE NAAM: సందడికి వేళైంది.. 'ఏక్ షామ్ చార్మినార్ కే నామ్' మొదలైంది.! - ek sham charminar ke naam event started at charminar
చార్మినార్ వద్ద 'ఏక్ షామ్ చార్మినార్ కే నామ్'(EK SHAM CHARMINAR KE NAAM) సందడి షురూ అయింది. సండే సాయంత్రం సరదాగా గడిపేందుకు నగరవాసులు చార్మినార్‌కు బారులు తీరారు. చార్మినార్ వీధుల్లో కనుచూపు మేర వరకు సందర్శకులతో కిటకిటలాడింది. చిన్నారులు, యువతీయువకుల కోసం ప్రత్యేక కార్యక్రమాలతో ఆ ప్రాంగణమంతా బిజీబిజీగా మారింది.
హైదరాబాద్ చారిత్రక వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచే చార్మినార్ వద్ద సందర్శకుల సందడి నెలకొంది. పురపాలకశాఖ, జీహెచ్ఎంసీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 'ఏక్ షామ్ చార్మినార్ కే నామ్'(EK SHAM CHARMINAR KE NAAM) కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. అర్ధరాత్రి వరకు సాగనున్న సాంస్కృతికోత్సవంలో పోలీసుల బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తిరంగ విద్యుత్ దీపపు వెలుగుల్లో చార్మినార్ చూపరుల మనసును దోచేస్తోంది. అలనాటి అపురూప కట్టడం ఎదుట(EK SHAM CHARMINAR KE NAAM) సెల్ఫీ దిగేందుకు జనం పోటీపడుతున్నారు.
మహిళల భద్రత కోసం
చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించడంతో పాటు మహిళల భద్రత కోసం షీ బృందాలు గస్తీ కాస్తున్నాయి. వివిధ శాఖల సమన్వయంతో పోలీసుశాఖ భారీ ఏర్పాట్లు చేసింది. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమం తరహాలో చార్మినార్(EK SHAM CHARMINAR KE NAAM) వద్ద భారీ హంగులతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
చార్మినార్ వద్ద నేటి నుంచి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 3గంటల నుంచి అర్ధరాత్రి వరకు... 'ఏక్ షామ్ చార్మినార్ కే నామ్' (EK SHAM CHARMINAR KE NAAM) కార్యక్రమం కొనసాగనుంది.
ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలు..
నగరవాసులను ఆకట్టుకునేలా.... సాయంత్రం ఆరున్నరకు పోలీస్ బ్యాండ్ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి ఎనిమిదన్నరకు దక్కనీ మజాహియ ముషాయిర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక అర్ధరాత్రి వరకు లాడ్ బజార్‌ను తెరిచి ఉంచనున్నారు. చిన్నారులను ఆకట్టుకునేలా జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. భోజన ప్రియుల నోరూరించేలా... ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. (EK SHAM CHARMINAR KE NAAM).
ప్రతి ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు..
తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచనలతో జీహెచ్ఎంసీ, పోలీసులు, విద్యుత్‌శాఖల సమన్వయంతో... అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏక్ షామ్ చార్మినార్ కే నామ్' (EK SHAM CHARMINAR KE NAAM) కార్యక్రమం దృష్ట్యా.... పాతబస్తీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి పది వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అఫ్జల్‌గంజ్, మదీన, గుల్జార్‌హౌజ్, కాలీకమాన్, ఫలక్‌నుమ, హిమత్‌పుర, పంచ్‌మోహల్లా, చార్మినార్, మొఘల్‌పుర, కోట్ల అలిజ, మూసాబౌలి, ముర్గిచౌక్, ఘాన్సీబజార్, లాడ్‌బజార్, మోతీగల్లీ, కిల్వత్ తదితర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించనున్నట్టు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించారు.
వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలంటే..
సందర్శకుల వాహనాలు నిలిపేందుకు అధికారులు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. చార్మినార్‌కు (EK SHAM CHARMINAR KE NAAM) వచ్చే ప్రజలు, సందర్శకులు తమ వాహనాలను నయాపూల్, మదీన ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. చార్మినార్ మార్గం గుండా ప్రయాణించే సాధారణ ప్రజలు... ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సీపీ అంజనీకుమార్ కోరారు. వాహనాలను పోలీసులు సూచించిన ప్రాంతంలోనే నిలిపివేసి రావాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: తెనాలిలో డబుల్ హార్స్ మినపగుళ్ల ప్లాంట్... హాజరైన అన్నపూర్ణమ్మ, నవ్యస్వామి