మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన జగదీశ్వర్(8) సోమవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి నిద్రపోయాడు. బాలుడు నిద్రిస్తున్న సమయంలోనే తాచుపాము కాటేసినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే ప్రత్యేక వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు.
నిత్యం తమ కళ్లెదుటే తిరిగిన బాలుడు అచేతనంగా పడి ఉండటం చూసిన స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కళ్లెదుటే కన్నుమూసిన కుమారుడిని చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పాము కాటు వేసిన వెంటనే గుర్తించి వైద్య సాయం అందిస్తే బాలుడు బతికే వాడని గ్రామస్థులు తెలిపారు.