Eggs in Anganwadi centres: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం కోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు ఇస్తుంటారు. ఒక్కో గుడ్డు బరువు 45 నుంచి 50 గ్రాముల వరకు ఉండాలి. కానీ.. గుత్తేదారులు మార్కెట్‌లో అమ్ముడుపోని చిన్నసైజు గుడ్లను సరఫరా చేస్తున్నారు. వాటి బరువు 30 నుంచి 35 గ్రాముల్లోపే ఉంటోంది. 'మరీ గోలీ సైజులో ఉన్నవాటిని తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. పైగా తమతో వాగ్వాదానికి దిగుతున్నారు. 2 నెలల నుంచి విజయవాడలోని కేంద్రాలకు చిన్నవే సరఫరా చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు’ అని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: