రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో విద్యార్థులకు విద్యాప్రమాణాలు మెరుగుపర్చనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. అందులో భాగంగానే రానున్న ఉగాదిని పురస్కరించుకొని విద్యాశాఖలో పోస్టుల భర్తీకి సంబంధించిన క్యాలెండర్ను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన ప్రథకం కింద ఫీజులు చెల్లిస్తామన్నారు.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కళాశాలల్లో విద్యావిధానంలో సంచలన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.