ETV Bharat / city

'ఈవీఎంల భద్రతపై అనుమానం వద్దు' - strong rooms

ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ భద్రతపై అనుమానాలు అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల్లోకి ఎవరికి ప్రవేశం ఉండదని.. ఆ ప్రదేశాల్లో మూడంచెల భద్రత వ్యవస్థ ఉంటుందని తెలిపారు.

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్​ల భద్రతపై అనుమానం అవసరం లేదు ..!
author img

By

Published : Apr 24, 2019, 4:28 PM IST

ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ భద్రతపై అనుమానాలు అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్​లలో ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల్లోకి ఎవరికి ప్రవేశం ఉండదని.. ఆ ప్రదేశాల్లో మూడంచెల భద్రత వ్యవస్థ ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ సందేహ నివృత్తి కోసం తమ ఏజెంట్లను స్ట్రాంగ్ రూమ్, కంట్రోల్ రూమ్​లలో 24 గంటలు ఉంచవచ్చని ద్వివేది వెల్లడించారు. స్ట్రాంగ్‌ రూమ్​ల భద్రతలో పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉండవని... వైఫై ద్వారా ఈవిఎంలను నియంత్రిస్తారనే ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. అపోహలకు చోటివ్వకుండా ఉండేలా భద్రత చర్యలు చేపట్టామని వివరించారు. చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్‌రూమ్‌లపై వచ్చినవి... తప్పుడు ప్రచారాలు మాత్రమేనన్నారు. ఈ తప్పుడు ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది చెప్పారు.

Intro:jk_ap_knl_21_24_z.r.e.a.c_meeting_b_ab_c2
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో జడ్. ఆర్. ఈ. ఏ.. సీ. సమావేశం

Body: జడ్ అర్ ఈ ఎ సమావేశం

Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నబద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.