ETV Bharat / city

మెరికలకు ఇంజినీరింగ్ పట్టం కట్టేదేలా? - ఏపీ ఇంజినీరింగ్ కాలేజీలు వార్తలు

ఎంసెట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్న విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఐఐటీ, నిట్‌, ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకే విద్యార్థులు..వారి తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మెరికల్లాంటి విద్యార్థులు బయటకు వెళ్లిపోతున్నారు.

మెరికలకు ఇంజినీరింగ్ పట్టం కట్టేదేలా?
మెరికలకు ఇంజినీరింగ్ పట్టం కట్టేదేలా?
author img

By

Published : Jan 2, 2021, 7:07 AM IST

ఎంసెట్​లో ప్రతిభ కనబరిచి.. ర్యాంకులు సాధించిన విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరట్లేదు. ప్రవేశాలకు ఆసక్తి చూపే అభ్యర్థుల కంటే రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లోని సీట్లే అధికంగా ఉంటున్నాయి. కొన్ని కళాశాలల్లోనే యాజమాన్య, కన్వీనర్‌ కోటాకు డిమాండ్‌ ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు పెరగకపోవడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రతిభ ఉన్న వారేరీ..?

ఎంసెట్‌లో 1-100 ర్యాంకులు సాధించిన వారిలో ఒక్కరు కూడా ఇంజినీరింగ్‌లో చేరేందుకు ఐచ్ఛికాలను నమోదు చేసుకోలేదు. 10వేల లోపు ర్యాంకులు సాధించిన వారిలో 6,188మంది మాత్రమే ప్రవేశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 101-200లోపు ర్యాంకుల్లో ఇద్దరే కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు ఇచ్చారు. 500లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో కేవలం 40మంది మాత్రమే విద్యా సంస్థల్లో చేరేందుకు ఆసక్తి చూపారు. సాధారణంగా 5వేలలోపు ర్యాంకులు సాధించిన వారిని ప్రతిభ గల విద్యార్థులుగా భావిస్తారు. ఇలా ప్రతిభ కలిగిన వారిలోనూ 2,565మంది మాత్రమే ఐచ్ఛికాలు నమోదు చేశారు. ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు ఐచ్ఛికాల నమోదు, మార్పునకు శుక్రవారం ఆర్థరాత్రితో గడువు ముగిసింది.

కోర్సుల ఎంపికకు 82వేలు మంది..

ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు 90,076మంది రిజిస్టర్‌ చేసుకోగా.. వీరిలో 89,078మంది కోర్సుల ఎంపికకు అర్హత సాధించారు. చివరి రోజైన శుక్రవారం రాత్రి 7గంటల వరకు ఐచ్ఛికాల నమోదుకు 83,701మంది పాస్‌వర్డ్‌ సృష్టించుకోగా.. 82,925మంది కోర్సులు, కళాశాలల ఎంపికకు సంసిద్ధత తెలిపారు.

సీట్లే అధికం..

ఇంజినీరింగ్‌లో సీట్లు భారీగా మిగిలిపోనున్నాయి. కన్వీనర్‌ కోటాలో విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు కళాశాలల్లో కలిపి 91,875 సీట్లు ఉండగా.. చివరి రోజు శుక్రవారం రాత్రి 7గంటల వరకు పాస్‌వర్డ్‌ సృష్టించుకున్న వారు 83,701మంది మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్య కొంత పెరిగి 84వేల వరకు వెళ్లినా రాష్ట్రంలో 7,800కుపైగా సీట్లు మిగిలిపోనున్నాయి. యాజమాన్య కోటా, కన్వీర్‌ కోటా కలిపి మొత్తం 1,29,016 సీట్లు ఉండగా.. వీటిపై 10శాతం ఈడబ్ల్యుఎస్‌ కోటా సీట్లు వస్తాయి. అదనంగా వచ్చే 12,900 సీట్లలోనూ మిగిలేవే అధికం.

ఇదీ చదవండి:

'నౌకా సిబ్బందికి తక్షణ సాయం అందించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.