ETV Bharat / city

దుర్గ గుడి పాలకమండలి సమావేశం.. 44 అంశాలపై చర్చ - దుర్గ గుడి పాలకమండలి ఛైర్మన్ బోర్డు మీటింగ్ వార్తలు

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సమావేశం జరిగింది. వచ్చే నెల జరిగే భవానీ దీక్షల ఏర్పాట్లు, తదితర అంశాలపై సభ్యులు చర్చించారు.

దుర్గగుడి పాలకమండలి సమావేశం
దుర్గగుడి పాలకమండలి సమావేశం
author img

By

Published : Dec 15, 2020, 9:05 PM IST

దుర్గ గుడి పాలకమండలి సమావేశం ఛైర్మన్‌ పైలా స్వామినాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 44 అంశాలపై చర్చించారు. లాక్‌డౌన్‌ అనంతర పరిణామాలు, కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధించేలా భక్తులకు మరింత మెరుగైన రీతిలో అమ్మవారి దర్శనం కల్పించే అంశాలపై చర్చ జరిగింది. వచ్చే నెల జరిగే భవానీ దీక్షల ఏర్పాట్లపైనా పాలకమండలి సమావేశంలో సభ్యులు పలు సూచనలు చేశారు.

దసరా నవరాత్రుల సమయంలో కొండచరియలు విరగిపడటం, మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి అమ్మవారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధి, కొండచరియలు విరిగిపడకుండా శాశ్వత చర్యలకు నిధులు కేటాయించడంపై పాలకమండలి పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో చేపట్టబోయే నిర్మాణ పనులపైనా సమీక్షించారు.

ఇదీ చదవండి: లైవ్​ వీడియో: సిలిండర్​ పేలి అగ్నికి ఆహుతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.