ETV Bharat / city

హమ్మయ్య.. విజయవాడలో 'చెత్త' సమస్యకు స్వస్తి! - bin

విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఏళ్ల నాటి నుంచి ఉన్న డంపింగ్ యార్డు... చెత్త రహితంగా మారనుందా? ఇకపై నగరంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించే విధానానికి స్వస్తి పలకనున్నారా? ఇప్పుడున్న డంపింగ్ యార్డు ప్రాంతాన్ని త్వరలో ప్లాస్టిక్ రీసైకిల్ పార్కుగా మార్చనున్నారా? ప్రభుత్వ వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి.

dumping_yard_problem_solved
author img

By

Published : Aug 21, 2019, 11:05 PM IST

హమ్మయ్య!..విజయవాడలో 'చెత్త' సమస్యకు స్వస్తి!

విజయవాడ నగర వాసులను ఏళ్ల నాటి నుంచి వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి చెత్త సమస్య. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వందల మంది సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తున్నా... నేటికీ అదే సమస్య అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా... బయోమైనింగ్ పద్ధతిలో చాలా వరకు అధికారులు చెత్తను నిర్వీర్యం చేశారు. మిగిలిన చెత్తనూ తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

శాశ్వత పరిష్కారానికి కృషి

నగరంలో 59 వార్డులు ఉండగా.... ప్రస్తుతం 31 వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి తడిపొడి చెత్తను సేకరిస్తున్నారు. అయితే వచ్చే నెల 15 నాటికి మిగిలిన వార్డుల్లోనూ పూర్తి స్థాయిలో తడి పొడి చెత్తను సేకరించేందుకు ప్రయత్నిస్తామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. మరోవైపు దీనికి సమాంతరంగా చెత్తను డంపింగ్ యార్డు నుంచి తరలించే ప్రక్రియ కొనసాగనుంది. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఇకపై చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడం కాకుండా ఇందుకోసం శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు ప్రణాళిక రచిస్తున్నారు. గుంటూరులో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పూర్తైన తర్వాత... విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని అజిత్ సింగ్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

డంపింగ్ యార్డులో మొత్తం చెత్తను తొలగించిన తర్వాత....ఈ స్థలంలో ప్లాస్టిక్ రీసైకిల్ పార్కు ఏర్పాటు చేసేందుకు సైతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను ప్రభుత్వానికి నివేదించి...త్వరలోనే అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించనున్నారు.

Intro:Ao_atp_62_21_adhikarula_chethivaatan__raithula_aagraham_avb_ap10005
~~~~~~~~~~~~~~~~~~*
ఆ 12.5 కిలోల ఉలవలు ఏమైనట్లు...??
~~~"""""""~~~~~""~"*~~~*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలకేంద్రంలో
వ్యవసాయ అధికారులు పంపిణీ కార్యక్రమం అస్తవ్యస్తంగా తయారైంది. ప్రభుత్వం మంజూరు చేస్తున్న 25 కిలోల విత్తనం లో లో సగం అధికారుల చేతివాటం తో పక్కదారి పడుతున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి .జిల్లాలో అన్ని మండలాల్లోనూ ఒక్కో రైతుకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాల పంపిణీలో భాగంగా 25 కిలోల ఉలవలు పంపిణీ చేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లా కుందుర్పి మండలం లో మాత్రం ఇద్దరు రైతులకు కలిపి 25 కిలోల పంపిణీ చేస్తూ మిగిలిన ఇద్దరు రైతులకు కలిపి 25 కిలోలు ఎవరికి ఇస్తున్నారో అర్థం కాకుండా గందరగోళం సృష్టిస్తున్నారు. ఒక్కో రైతు మిగిలిన 12.5 కిలోలు ఎక్కడ వేస్తున్నారు అధికారులు స్పష్టంగా చెప్పటం లేదు.

వాస్తవానికి ఒక రైతుకు ఇరవై ఐదు కేజీల వులవల పంపిణీ చేయాల్సి ఉంది ఇందులో భాగంగా రైతుల సెల్ఫోన్లకు ఒటిపి మాత్రం 25 కేజీలు పంపిణీ చేసినట్లు మెసేజ్ వస్తుంది కానీ అక్కడ పంపిణీ జరుగుతున్నది మాత్రం ఇద్దరు రైతులకు చెరిసగం చేసుకోమని అధికారులు ఇద్దరు రైతులకు కలిసి 25 కిలోలు ఇస్తున్నారు ఈ విషయం సంబంధించిన అధికారిని వివరణ కోరగా ఆయన మనకు వచ్చిన స్టాక్ తక్కువగా వచ్చినందుకు రైతులందరికీ పంపిణీ చేయడం సాధ్యం కాదు అనే వుద్దేశ్యంతో ఉన్న స్టాకునే అందరికీ సర్దడం కోసం ఇలా చేస్తున్నామని అధికారులు తాపీగా చెబుతున్నారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.