ETV Bharat / city

వలస ఉద్యోగికి రూ.90 లక్షలతో వైద్యం చేయించిన సంస్థ

తెలంగాణకు చెందిన మల్లయ్య దుబాయిలోని ప్రోస్కేప్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. బ్రెయిన్‌ ట్యూమర్‌తో అనారోగ్యం పాలయ్యాడు. యాజమాన్యం అస్పత్రిలో చేర్పించి సుమారు రూ.90 లక్షలు (4.35 లక్షల ధిరమ్స్‌) వెచ్చించి వైద్యం చేయించింది. వలస ఉద్యోగిపట్ల ఉదారత చాటుకుంది. అంతేకాకుండా స్వదేశానికి పంపించింది.

author img

By

Published : Jul 20, 2020, 10:32 AM IST

Dubai company spend operation amount on migrate worker from telangana

దుబాయిలో 19 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగి పట్ల ఆ సంస్థ ఉదారత చాటుకుంది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన బత్తిని మల్లయ్య దుబాయిలోని ప్రోస్కేప్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇటీవల బ్రెయిన్‌ ట్యూమర్‌తో అనారోగ్యం పాలయ్యాడు. కంపెనీలో విధుల్లో ఉండగానే పడిపోవటంతో యాజమాన్యం అస్పత్రిలో చేర్పించి సుమారు రూ.90 లక్షలు (4.35 లక్షల ధిరమ్స్‌) వెచ్చించి వైద్యం చేయించింది.

మల్లయ్య భార్య అభ్యర్థన మేరకు స్వదేశానికి పంపేందుకు అంగీకరించింది. ఇక్కడి నుంచి అనుమతి లభించాల్సి ఉండటంతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ క్రిష్ణభాస్కర్‌ స్పందించి లేఖ రాశారు. దీంతో దుబాయి నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు సంస్థ యాజమాన్యం పంపించింది. శనివారం స్వదేశానికి చేరుకున్న మల్లయ్య ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దుబాయిలోని ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ప్రతినిధులు చిలుముల రమేశ్‌, ఆరెల్లి రమేశ్‌ బాధితుడి తరలింపును సమన్వయం చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి

నడిసంద్రంలో 'కరోనా'.. అంతుచిక్కని ప్రశ్నలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.