Drunker Attack on Conistable : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు. మద్యం సేవించి ఆకతాయిలు అల్లరి సృష్టిస్తున్నారంటూ కొందరు 100 కు ఫోన్ చేయగా.. వారిని అదుపు చేసేందుకు మచిలీపట్నం పోలీసులు వెళ్లారు.
అయితే.. మద్యం మత్తులో తూగుతూ వీరంగం సృష్టిస్తున్న మద్దెల కృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కృష్ణ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మత్తులో విచక్షణ కోల్పోయిన కృష్ణ.. తీవ్ర ఆగ్రహంతో కానిస్టేబుల్ శ్రీనివాస్ తలపై ఇటుకతో కొట్టాడు. దీంతో.. శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు.
స్టేషన్ సిబ్బంది శ్రీనివాస్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటన పై ఆరా తీసిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ దాడికి పాల్పడిన కృష్ణను వెంటనే అదుపులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మచిలీపట్నం పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడు వాలంటీర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి : Young man died while moving marijuana: గంజాయి తరలిస్తుండగా ప్రమాదం..యువకుడు మృతి