ETV Bharat / city

కరోనా కారణంగా ప్రమాదంలో రహదారి భద్రత - Drunken Drive in vijayawada

కరోనా కారణంగా రహదారి భద్రత ప్రమాదంలో పడింది. వైరస్‌ ముప్పు పొంచి ఉన్నందున పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ను చాలాకాలంగా నిలిపేశారు. మరోవైపు.. లిక్కర్‌ అమ్మకాలు యధావిధిగా జరుగుతున్నందున మందుబాబులకు అడ్డే లేకుండా పోయింది. రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభమైన వేళ.. ఈ అంశం ప్రశ్నార్థకంగా మారింది.

Drunken Drive
Drunken Drive
author img

By

Published : Jan 19, 2021, 12:09 PM IST

కరోనా కారణంగా ప్రమాదంలో రహదారి భద్రత

మందుబాబులను నియంత్రించే డ్రంకెన్‌ డ్రైవ్‌ను పోలీసులు నిలిపేయడం సామాన్యుల్లో గుబులు రేపుతోంది. విజయవాడ నగరంలో రాత్రి 11 గంటల వరకూ మద్యం అమ్మకాలు సాగుతుండగా బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మద్యం సేవించిన వారు చాలామంది సొంతంగానే వాహనాలు నడుపుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. అలాంటి వారికి డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిలిపేసిన వేళ ప్రత్యామ్నాయ చర్యలు ఏం చేపట్టాలనేది ప్రశ్నార్థకంగా మారింది. మోతాదుకు మించి మద్యం సేవిస్తున్న పలువురు రెండు, మూడు కిలోమీటర్లలో ఇంటికి చేరొచ్చనే భావనతో బైకులు, కార్లపై వేగంగా వెళ్తున్నారు. మలుపులు, ఎత్తుపల్లాల వద్ద నియంత్రణ కోల్పోయి, కొన్నిసార్లు రాంగ్‌రూట్‌లో సైతం వెళ్తూ ప్రమాదాలు చేస్తున్నారు. పటమట, పెనమలూరు, పోరంకి, చిట్టినగర్, ఎంజీరోడ్డు, రామవరప్పాడు, సింగ్‌నగర్, భవానీపురం, కృష్ణలంక, కరెన్సీ నగర్, మాచవరం ప్రాంతాల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

పోరంకిలో 15 రోజుల క్రితం ఓ యువకుడు ఇదే రీతిలో రోడ్డుపై నిలిపి ఉంచిన 3 ద్విచక్ర వాహనాలను కారుతో ఢీకొట్టాడు. విదేశాలకు వెళ్తున్నందున, కేసు పెడితే తన జీవితం నాశనం అవుతుందని బాధితుల్ని వేడుకొని రాజీ కుదుర్చుకున్నాడు. ఇటీవల నేతాజీ వంతెన కూడలి వద్ద ఓ లారీ డ్రైవర్‌ రోడ్డుపై వెళ్లే వారిని చిరునామా అడుగుతున్నాడు. ఆ సమయంలో అతడు ఏం చేస్తున్నాడో తెలీనంత మత్తులో ఉన్నాడు. ఈ పరిస్థితులను నివారించాల్సిన పోలీసులు ప్రమాదాలు జరిగినపుడు పరీక్షలు చేస్తామని చెబుతున్నారు.

మద్యం సేవించి వాహనం నడిపే వ్యక్తి కొద్దిసేపు బాగానే ఉన్నా.. కాసేపటికే కళ్లు మూసుకుపోతాయి. కాళ్లు, చేతుల మధ్య సమాచార లోపం ఏర్పడుతుంది. ఆ సమయంలో మెదడులో ఆలోచించే శక్తి తగ్గుతుంది. మెదడు ఆజ్ఞలిస్తున్నా.. నాడీవ్యవస్థ పనిచేయదు. అలాంటపుడు ప్రమాదాలు జరిగితే, గుండె ఆగిపోయే ప్రమాదమూ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి : మహిళల నేతృత్వంలో రైతు ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.